తెలుగులో ఇప్పుడు టాప్ యాంకర్ ఎవరు? అంటే అందరూ సుమ పేరే చెప్తారు. గత పది పదిహేనేళ్ల నుంచి టీవీ యాంకర్ గానే ఈమెనే గుర్తొస్తుంది. అంతలా మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మరికొన్నేళ్ల పాటు కూడా అలరించడం గ్యారంటీ. ఆమెని చూస్తే అలా ముగ్దులైపోతారు తప్ప.. వయసు గురించి అస్సలు ఆలోచించరు. ఇక సుమ ముందు ఎంత పెద్ద స్టార్స్ అయినా సైలెంట్ అయిపోతారు. అంత పవర్ ఉంది సుమ యాంకరింగ్ కి. అలాంటి సుమ ఇప్పుడు.. అభిమానులకు షాకిచ్చే న్యూస్ ఒకటి చెప్పింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పాలక్కాడ్ లో పుట్టిన సుమ, ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో సహాయపాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ‘జయమ్మ పంచాయతీ’ సినిమాలో లీడ్ రోల్ చేసి మెస్మరైజ్ చేసింది. నటిగా అంత పేరు రాకపోయినప్పటికీ.. యాంకర్ గా మాత్రం ఇప్పటికీ ఈమెనే నంబర్ వన్. రియాలిటీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఇలా ఏదైనా సరే సుమ కచ్చితంగా ఉండాల్సిందే అనే రేంజ్ కి వెళ్లిపోయింది.
ఇక సుమకు అన్ని ఛానెల్స్ లో కంటే ఈటీవీతో అనుబంధం ఎక్కువ. ‘స్టార్ మహిళ’ ప్రోగ్రామ్ ని ఏకంగా 4000 ఎపిసోడ్ల పాటు చేసింది. ప్రస్తుతం అన్ని ఛానెల్స్ లోనూ ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగానే ఉంది. ఇక రాబోతున్న న్యూయర్ సందర్భంగా ఈటీవీలో “వేరే ఈజ్ ద పార్టీ” అనే ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నారు. ఇందులో సుమన్ సన్మానించారు. ఈ సందర్భంగా తన యాంకరింగ్ కెరీర్ ని గుర్తుచేసుకున్న ఆమె.. తనని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది. అలానే కొంతకాలం విరామం ఇవ్వాలనుకుంటున్నాని కూడా చెప్పి షాకిచ్చింది. దీంతో యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వనుందా ఏంటా అని అందరూ షాకవుతున్నారు. లేకపోతే ప్రాంక్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సుమ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని , కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.