దేశీయ టెలివిజన్ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. అసలు ఎవరా నటి? ఆమె ఎలా చనిపోయిందంటే..!
సినీ, టెలివిజన్ రంగాల్లో వరుస మరణాలు జరుగుతున్నాయి. తమ నటనతో ప్రేక్షకులను ఎంతో కాలంగా అలరిస్తూ వస్తున్న యాక్టర్స్ ఇలా చనిపోవడం బాధాకరం. వారి మరణాలతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా భారతీయ టెలివిజన్ రంగంలో మరో విషాదం చోటుచేసుకుంది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ టెలివిజన్ నటి రోడ్డు యాక్సిడెంట్లో దుర్మరణం పాలయ్యారు. షూటింగ్ ముగిసిన తర్వాత టీవీ నటి సుచంద్ర దాస్‌గుప్తా బైక్ ట్యాక్సీ మీద ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాగనగర్లో చోటుచేసుకుంది.
షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేందుకు సుచంద్ర దాస్ గుప్తా ఒక యాప్ ద్వారా బైక్‌ను బుక్ చేసుకున్నారు. సుచంద్ర ఆ బైక్ మీద ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తూ ఒక సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి హఠాత్తుగా బ్రేక్ వేశాడు. అదే టైమ్‌లో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్ ఆమె మీద నుంచి దూసుకెళ్తింది. దీంతో సుచంద్ర దాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ వేసుకున్నా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న బారానగర్ పోలీసులు.. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఇకపోతే.. సుచంద్ర దాస్‌గుప్తా పలు బెంగాలీ టీవీ షోల్లో కనిపించారు. గౌరీ అనే షోలో సహాయక పాత్రలో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఆమె మరణంతో బెంగాల్ టెలివిజన్ రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
India: Popular Bengali actress #SuchandraDasgupta died in a road accident on May 21 when a truck collided with her bike taxi in West Bengal. https://t.co/THkO9wx5RW
— Gulf News (@gulf_news) May 21, 2023