‘జబర్దస్త్’ అనగానే కామెడీ స్కిట్లతో పాటు జోడీలు కూడా గుర్తొస్తాయి. అసలు ఎవరు ఎవరితో కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తారనేది తెలీదు. కాకపోతే అందరిలో బాగా ఫేమస్ అయింది మాత్రం సుధీర్-రష్మీనే. వీళ్లిద్దరి మధ్య లవ్ ఉందా, నిజంగా పెళ్లి చేసుకుంటారా అనేది పక్కనబెడితే.. సుధీర్, జబర్దస్త్ షోలో ఉన్నన్ని రోజులు ఈ జంట బాగా ఎంటర్ టైన్ చేసింది. వీళ్ల తర్వాత వచ్చినవాళ్లలో ఇమ్ము-వర్ష జోడీ.. కాస్తలో కాస్త ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్స్ లో నటించి వర్ష, జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత బాగా గుర్తింపు తెచ్చుకుంది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, కెవ్వు కార్తిక్ టీమ్స్ లో చేస్తూ ఫేమ్ సంపాదించింది.
ప్రస్తుతం మాత్రం బుల్లెట్ భాస్కర్ టీమ్ లో రెగ్యులర్ గా వర్ష స్కిట్స్ చేస్తూ ఉంది. ఇకపోతే కెవ్వు కార్తిక్ టీమ్ లో చేస్తున్నప్పుడు ఇమ్ముతో ఈమె లవ్ ట్రాక్ నడిపించింది. అప్పట్లో వీళ్ల ప్రోమో వస్తే చాలు.. ప్రేక్షకులు కూడా తెగ చూసేవాళ్లు. సుధీర్-రష్మీ జోడీకి చేసినట్లే.. పెళ్లి చేయడం లాంటి స్పెషల్ ఎపిసోడ్స్ చేశాడు.మరి ఏమైందో ఏమో గానీ బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఇమ్ము-వర్ష కలిసి స్కిట్స్ చేస్తున్నారు గానీ గతంలో ఉన్నంత కెమిస్ట్రీ అయితే కనిపించట్లేదు. ఓసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇమ్ము.. తనని మగాడు అనేసరికి చాలా సీరియస్ అయిపోయింది.
ఆ సమయంలో ఆది, రాంప్రసాద్.. వర్షని కూల్ చేయాలని చూశారు గానీ, ఆమె మొహమాటపడుతూనే ఆ ఎపిసోడ్ పూర్తి చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో వర్ష, షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ‘రీసెంట్ గా ఓ మూడు నాలుగు నెలల నుంచి మేం సరిగా మాట్లాడుకోవట్లేదు. నేను ఏదన్నా తప్పు చేసుకుంటే ఐ యామ్ సారీ’ అని చెప్పింది. మరి వర్ష సారీ చెప్పింది ఇమ్ముకా లేదా వేరే ఎవరైనా పర్సన్ కా అనేది తెలియాల్సి ఉంది. వర్ష చెప్పిన విషయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఇమ్మాన్యూయేల్‌పై మరోసారి తన ప్రేమను బయటపెట్టిన వర్ష.. ‘ఇమ్మూ కాదంటే నా ఊపిరి ఆగిపోతుంది’!