సిరి హన్మంత్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా ఆమె అందంతో, క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది.యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సిరి.. పలు వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని పట్టేసింది. సీజన్ 5లో అడుగుపెట్టి.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాల్లో కూడా నటించింది. ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఫిట్ నెస్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, ఫోటోషూట్ లు అప్ లోడ్ చేస్తూ ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంటుంది.
తాజాగా ఈ సిరి.. బుల్లితెర షోలో పాల్గొంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొని మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో సిరి, ఆర్జే కాజల్, సన్నీ, మానస్, అరియనా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ ముక్కు అవినాష్, నోయెల్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఈ షోలో ఒక టాస్క్ లో భాగంగా ఒక పాటకి సిరి స్టెప్పులేసింది. పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ అత్తారింటికి దారేది సినిమాలో ‘బాపు గారి బొమ్మో’ పాటకి సిరి నర్తించింది. మామూలుగా ఈ పాట క్లాస్ గా ఉంటుంది. అయితే మొదట్లో క్లాస్ స్టెప్పులతో అలరించిన సిరి.. కాసేపటికి మాస్ స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. సిరి వేసిన మైండ్ బ్లోయింగ్ స్టెప్పులకి మతి పోతుందని, సిరిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సిరి మాస్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.