బుల్లితెరపై ఎన్నో వినోదాత్మక షోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న షోస్ మాత్రమే కాకుండా ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ బట్టి సరికొత్త కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంటారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీమ్ నుండి కొత్తగా ‘లిటిల్ హార్ట్స్’ అని ఓ కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ అయ్యింది. ఇటీవల ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే.. నవంబర్ 14న జరుపుకోనున్న బాలల దినోత్సవం(చిల్డ్రన్స్ డే) సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసారం చేయనున్నారు.
వచ్చే ఆదివారం అంటే.. నవంబర్ 13న రాత్రి 7:30 గంటలకు ఈ లిటిల్ హార్ట్స్ ప్రోగ్రాం ప్రసారం కానుండగా.. ప్రోమో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రోమోలో బుల్లితెర సెలబ్రిటీలంతా వారి పిల్లలతో హాజరయ్యారు. స్టేజ్ పై పేరెంట్స్, పిల్లలకు మధ్య సరదా పోటీలు, డాన్సులు.. ఇలా అన్ని ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని హైపర్ ఆది హోస్ట్ చేయడం విశేషం. ఈ క్రమంలో ప్రోగ్రాం మధ్యలో స్టేజ్ పై పల్సర్ బైక్ ఫేమ్ సింగర్ రమణ స్పెషల్ పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. అదీగాక తన పాటతో జబర్దస్త్ భానును ఆకట్టుకొని.. చివరికి మోకాలిపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీంతో భాను కూడా స్టేజిపైనే సిగ్గుపడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఈ జంట ఎలా ఆకట్టుకుంటారో! వీడియో కోసం దీనిపై క్లిక్ చేయండి!