ఒకప్పుడు టాలెంట్ ఉన్నా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టేది. ఆఫీసుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత ల్యాగ్ లేదు. జస్ట్ చేతిలో ఒక స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే చాలు టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. స్మార్ట్ ఫోన్ అందరికీ అందుబాటులోకి వచ్చాక టాలెంట్ చూపించడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అదృష్టం ఉంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అదృష్టం ఆలస్యం చేస్తే ఏడాది, ఏడాదిన్నర తర్వాత సెలబ్రిటీ అయిపోవచ్చు. సెలబ్రిటీ అవ్వడం లేటవ్వచ్చేమో గానీ అవ్వడం మాత్రం పక్కా. అదృష్టంతో కొందరు, ఓపికతో కొందరు ఇలా చాలా మంది సామాన్యులుగా ఉంటూ సెలబ్రిటీలుగా ఎదిగారు. అలా ఎదిగిన వారిలో శాంతి బంగారం ఒకరు.
‘’బంగారం.. చాలా మంది అడుగుతున్నారు. నీ బంగారం ఎవరని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు దూరమయ్యావని చెప్పనా? లేక నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా? ఒకటి చెప్పనా? చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. కానీ నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో ప్రేమ అర్ధమవుతుంది. ఛీ పోరా” అనే ఎమోషనల్ డైలాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన శాంతి బంగారం ఇప్పుడు జబర్దస్త్ షోలో అడుగుపెట్టింది. చలాకీ చంటి టీమ్ లో స్కిట్ చేసిన శాంతి “బంగారం.. ఛీ పోరా” అంటూ స్టేజ్ పై రచ్చ రచ్చ చేసింది. శాంతి బంగారం పెర్ఫార్మెన్స్ కి ఇంద్రజ, రష్మీలు ఇంప్రెస్ అయ్యారు. సూపర్ చేసావ్ బంగారం అంటూ చప్పట్లతో అభినందించారు. ఇక బంగారం ఎవరు అని రష్మీ అడుగగా.. “బంగారం ఎవరూ లేరక్క.. సొంతంగా ఆలోచించాలని.. యాక్టింగ్ అవకాశాలు రావాలని ఇలా చేశానని” చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాంతి బంగారం చేసిన స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి శాంతి బంగారం స్కిట్ ఎలా చేసిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.