సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న ఆరిస్టులు భారీగానే పారితోషికాలు అందుకుంటారని తెలుసా? రోజూ మనల్ని అలరించే మన బుల్లితెర సీరియల్ హీరోయిన్లు ఒక రోజుకి తీసుకునే పారితోషికాలు ఎంతో తెలుసా?
తెలుగు నాట వంటలక్క పాపులర్ అయినంతగా.. అద్భుతంగా వంటలు చేసే ప్రొఫెషనల్స్ కూడా పాపులర్ కాలేదు. అంతలా వంటలక్కగా క్రేజ్ తెచ్చుకుంది ప్రేమి విశ్వనాథ్. కార్తీక దీపం సీరియల్ ద్వారా పరిచయమైన ప్రేమి విశ్వనాథ్… మొదటి పరిచయంలోనే అందరినీ తన మాయలో పడేసుకుంది. ఒక్క సీరియల్ తోనే తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పేరు తెచ్చుకున్న ప్రేమి విశ్వనాథ్.. ఒక రోజుకి రూ. 25 వేలు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన నవ్య స్వామి.. తెలుగులో చేసిన మొదటి సీరియల్ నా పేరు మీనాక్షి. ఈ సీరియల్ ద్వారా ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సీరియల్స్ లోనే కాకుండా.. పలు షోస్ లో పాల్గొంటుంది. ఇక ఈమె సీరియల్ లో నటించేందుకు ఒక రోజుకి రూ. 20 వేలు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.
మొదట్లో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సుహాసిని.. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. అపరంజి సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సుహాసిని.. అష్టాచమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం వంటి సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం దేవత సీరియల్ లో నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా సొంతంగా తన నిర్మాణ సంస్థలో సీరియల్స్ ని నిర్మిస్తోంది. ఇక సీరియల్స్ లో నటించడానికి ఒక రోజుకి 20 వేలు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.
అగ్ని సాక్షి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య ఒక రోజుకి రూ. 20 వేలు పారితోషికం తీసుకుంటుందని టాక్.
భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన పల్లవి రామిశెట్టి.. ఆడదే ఆధారం సీరియల్ తో లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ తర్వాత మాటే మంత్రము, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం పాపే మా జీవన జ్యోతి సీరియల్ లో నటిస్తోంది. ఈమె ఒక రోజుకి రూ. 15 వేలు పారితోషికం అందుకుంటుందని సమాచారం.
కథలో రాజకుమారి సీరియల్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న అషికా.. ఒక రోజుకి రూ. 12 వేలు పారితోషికంగా అందుకుంటున్నట్లు సమాచారం.
పలు సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటిస్తున్న హరిత తోట ఒక రోజుకి రూ. 12 వేలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.