కొన్నేళ్ల ముందు తెలుగు సీరియల్స్ లోని నటీనటులు గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బుల్లితెర నటులందరూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టేసి ఫేమస్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలు, సీరియల్స్ చేయడం మానేసి మరీ.. సోషల్ మీడియా ద్వారానే అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో నటి శ్రీవాణి ముందుటుంది. ఇప్పుడు ఆమె చేసిన ఓ వీడియో నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ ని అలరిస్తోంది. అభిమానుల నుంచి ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. భలే డ్యాన్స్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి నటిగా మారిన శ్రీవాణి, తెలుగులో సంఘర్షణ, కలవారి కోడలు, మనసు మమత, అధీర, కాంచన గంగ, చంద్రముఖి లాంటి సీరియల్స్ చేసింది. వంటల ప్రోగామ్స్ కి కూడా యాంకరింగ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ‘గొడవ’ అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది. ప్రస్తుతం సీరియల్స్ లో యాక్ట్ చేయకుండా ఇన్ స్టా, యూట్యూబ్ ద్వారానే ఎంటర్ టైన్ చేస్తుంది. కొన్నాళ్ల క్రితం కొత్తింట్లో అడుగుపెట్టిన శ్రీవాణి.. ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా టూర్ కి వెళ్లిన శ్రీవాణి.. ప్రస్తుతం సీరియల్స్ సీనియర్ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న హరితతో కలిసి డ్యాన్స్ చేసింది.
ఇదిలా ఉండగా శ్రీవాణి ఫ్యామిలీ గురించి చెప్పుకొంటే.. చిన్నప్పటి తనకు తెలిసిన విక్రమ్ ని, 18 ఏళ్ల వయసులో బయటకెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఆ టైంలో ఈమె హీరోయిన్ గా ‘ఘర్షణ’ సీరియల్ చేస్తోంది. ఈమె సడన్ గా అలా జంప్ అయిపోవడంతో.. ఆ సీరియల్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక పెళ్లి తర్వాత భార్యభర్త ఇద్దరూ కూడా టీవీల్లో కనిపిస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో మాత్రం సీరియల్స్ తగ్గించేసి పూర్తిగా యూట్యూబ్ కే అంకిమైపోయారు. వీళ్లకు నందిని అనే అమ్మాయి ఉంది. ఆ పాప కూడా యూట్యూబ్ వీడియోస్ లో కనిపిస్తూ ఉంటుంది. తల్లి శ్రీవాణితో కలిసి అప్పుడప్పుడు స్టెప్పులు కూడా వేస్తూ ఉంటుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. శ్రీవాణి-హరిత చేసిన డ్యాన్స్ మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.