‘రంగుల కల’ షో ద్వారా బుల్లితెర రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నటి పల్లవి రామిశెట్టి. మొదటి షోతో తన సత్తా చాటి.. అందిన అవకాశాలను అందిపుచ్చుకుని సక్సెస్ అయ్యారు. భార్యామణి, ఆడదే ఆధారం సీరియల్స్ తో పాపులర్ అయిన పల్లవి రామిశెట్టి.. భార్యామణి సీరియల్ లో ఉత్తమ నటన కనబర్చినందుకు నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘మాటే మంత్రము’ సీరియల్ లో వసుంధరగా అలరించారు. ప్రస్తుతం అత్తారింటికి దారేది, పాపే మా జీవన జ్యోతి సీరియల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈమె సీమంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు ఈమె. లో-ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తుంటారు. అందుకే పెద్దగా హడావుడి చేయకుండా తన సీమంతం కార్యక్రమాన్ని జరిపించేద్దామని అనుకున్నారు. కానీ వచ్చిన అతిధులు ఊరికే ఉంటారా? తమ సెల్ ఫోన్లకి పని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు.
ఆమె త్వరలో తల్లి కాబోతున్న శుభ తరుణంలో కుటుంబ సభ్యులు సీమంతం నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. తమ స్నేహితురాలు పల్లవితో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇఇ ఫోటోలను చూసిన అభిమానులు తల్లి కాబోతున్న పల్లవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పల్లవి 2019 మే 23న దిలీప్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మరి తల్లి కాబోతున్న పల్లవి రామిశెట్టిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.