సీరియల్స్ చూసేవాళ్లకు నవ్యస్వామికి పెద్దగా పరిచయం అవసరం లేదు. పేరుకే కన్నడ భామ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తన యాక్టింగ్, అందంతో ఆకట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెంచుకుంది. ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో మన ఆడియెన్స్ కు పరిచయమైన ఈమె.. చాలా తక్కువ టైంలో గుర్తింపు తెచ్చుకుంది. దాని తర్వాత ఇతర ఛానెల్స్ లోనూ పలు సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం పలు ఎంటర్ టైన్ మెంట్ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ ని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త కారు కొన్నట్లు ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా తన స్టోరీలో పోస్ట్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్స్, షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నవ్యస్వామి, ప్రస్తుతం ఓటీటీలోనూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఆహా ఓటీటీలోనూ ఈమె హీరోయిన్ గా చేసిన ‘ఇంటింటా రామాయణం’ రిలీజ్ కావాల్సి ఉంది. అలానే మరికొన్ని కూడా సెట్స్ పై ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే.. ఈమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఓ విషయం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ‘ఆమె కథ’ సీరియల్ లో తనతో పాటు యాక్ట్ చేసిన రవికృష్ణతో నవ్యస్వామి బాగా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగినట్లు బాగా గుసగుసలు వినిపించాయి. కానీ అవేం లేదని ఇద్దరు చెప్పారు. కానీ రూమర్స్ మాత్రం ఆగలేదు సరికదా ఎక్కువయ్యాయి.
రూమర్స్ సంగతి పక్కనబెడితే.. వీరిద్దరూ కలిసి పలు డ్యాన్స్ షోల్లో టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతమైతే నవ్వస్వామి సీరియల్స్ చేయడం లేదు. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా తాను కొత్త కారు కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని చెబుతూ నవ్య ఫ్రెండ్స్ ఇన్ స్టాలో ఆమెకు విషెస్ చెప్పారు. వాటిని తన స్టోరీలో ఈమె పోస్ట్ చేసింది. మిగతా వారి సంగతి పక్కనబెడితే నవ్యస్వామి కారు కొనగానే రవికృష్ణ.. వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ‘హే కంగ్రాచ్యూలేషన్స్ రౌడీ ఫెలో.. లిస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది’ అని లవ్ సింబల్స్ పెట్టి తన స్టోరీలో పోస్ట్ చేశాడు. ‘అంతేగా అంతేగా’ అని నవ్యస్వామి బదులిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.