‘సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్’ షో అట్టహాసంగీ ముగిసిన విషయం తెలిసిందే. సింగర్ శ్రుతిక ఈ షో విన్నర్‌గా నిలిచింది. ఫినాలేలో శ్రుతిక మెరిసేటి పువ్వా, ఆనతినీయరా, సంకురాత్రి కోడి వంటి అద్భుతమైన పాటలతో అదరగొట్టింది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన శ్రుతిక విన్నర్‌గా నిలవడమే కాకుండా ఆమె గాత్రంతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది.
విన్నర్‌గా నిలిచిన తర్వాతి నుంచి శ్రుతిక ఫుల్ బిజీ అయిపోయింది. ఇంటర్వ్యూలు, ఫ్యాన్ ఇంటరాక్షన్స్ అంటూ తీరిక లేకుండా పోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతిక ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెసేజ్‌లు వస్తుంటాయి కదా.. మరి ప్రపోజల్స్ కూడా వస్తుంటాయా? మీరు ఏమైనా చూశారా అని అడగ్గా శ్రుతిక ఎంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యింది.
“ఏంటో నాకు అన్నీ అక్క, అక్క, అక్క అనే మెసేజ్‌లు వస్తుంటాయి. వీ సపోర్ట్ యూ అక్కా అని చెబుతుంటారు. అవన్నీ చూసిన తర్వాత నేను మరీ అంత పెద్దదాన్ని అనుకుంటున్నారేమో అనిపిస్తుంటుంది. అయినా నన్ను వాళ్ల కుటుంబంలో ఒకరిగా ట్రీట్ చేయడం కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంటుంది. నిజంగా వాళ్ల అభిమానం ఎంతో గొప్పది” అంటూ శ్రుతిక సమాధానం చెప్పుకొచ్చింది.
ఇంక శ్రుతిక విన్నింగ్ అమౌంట్ విషయానికి వస్తే.. సరగిమప విన్నర్‌గా శ్రుతికకు రూ.లక్ష నగదు, మారుతీ సుజుకి వ్యాగనార్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. రన్నరప్‌కు రూ.5 లక్షల నగదు బహుమతిగా అందించారు. ప్రపోజల్స్ విషయంలో శ్రుతిక చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.