‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం దాదాపు 26 వారాలపాటు కొనసాగింది. ఎంతో మంది కొత్త గాయకులను ఈ వేదిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. సరిగమప గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కూడా ఆగస్టు 14న స్ట్రీమింగ్ అయ్యింది. ఈ చివరి ఎపిసోడ్‌లో లెజెండరీ సింగర్ సుశీల, నితిన్, శ్రుతిహాసన్, కృతి శెట్టి పాల్గొన్నారు.
ఈ షో విన్నర్‌గా హైదరాబాద్ కు చెందిన 20 ఏళ్ల శృతిక సముద్రాల నిలిచింది. ఆమెకు గట్టి పోటీ ఇచ్చిన సుధాన్షు రన్నరప్ గా నిలిచాడు. అయితే అసలు విన్నర్ ఎంత గెలుచుకున్నారు? రన్నర్ ఎంత గెలుచుకున్నారంటూ వెతుకులాట మొదలు పెట్టారు. అయితే ఈ షోలో విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ కేవలం లక్ష మాత్రమే ఇచ్చారు. కాకాపోతే మారుతీ సుజుకీకి చెందిన వ్యాగనార్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. విన్నర్ కు ట్రోఫీ, లక్ష బహుమతి, కారు బహూకరించారు.
ఇంక రన్నర్ సుధాన్షు విషయానికి వస్తే అతనికి రూ.5 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫినాలేలో అందరు సింగర్లు ఎంతో చక్కగా ప్రదర్శనలు చేశారు. విన్నర్ శృతిక మాట్లాడుతూ.. అంతా బాగా పర్ఫామ్ చేశారు. అందరికీ సరైన గుర్తింపు రావాలంటూ ఆకాంక్షించింది. తనకు ఈ టైటిల్ దక్కడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనకు దక్కడం వెనుక మెంటర్స్, వాయిస్ ట్రైనర్స్, తన చిన్ననాటి గురువులు, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ షో ద్వారా ఎంతో మంది మంచి సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుడాం ఏపీకి చెందిన సింగర్ పార్వతి తన ఊరికి బస్సు కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. మరి.. సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ విన్నర్ శృతికకు కామెంట్స్ రూపంలో మీ అభినందనలు తెలియజేయండి.