రీతూ చౌదరి మరోసారి తన తండ్రిని తలచుకుని స్టేజ్ పైనే గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంది. దేవుని పక్కన మా నాన్న ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది రీతూ చౌదరి.
కుటుంబంలో తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే బాండింగే వేరు. ఇక తండ్రులు తమ కూతుర్లను మహాలక్ష్మిలా చూసుకుంటూ ఉంటారు. ఏ చిన్న విషయాన్ని అయినా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల షేర్ చేసుకుంటూ ఉంటారు కూతుర్లు. ఇలాంటి బాండింగే మా నాన్నకు.. నాకు ఉందని స్టేజ్ పైనే కన్నీరు కార్చేసింది జబర్దస్త్ యాక్టర్ రీతూ చౌదరి. తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో మరోసారి తన తండ్రిపై ఉన్న ప్రేమను కన్నీటి రూపంలో చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
రీతూ చౌదరి.. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత బుల్లితెర టాప్ కామెడి షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ ను, పాపులారిటీని దక్కించుకుంది. అదీకాకా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ.. యాక్టీవ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే రీతూ తండ్రి గుండెపోటుతో చనిపోవడంతో తన బాధను కన్నీటితో చెబుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవిడ్రామా కంపెనీ ప్రోమోలో మరోసారి తన తండ్రిని తలచుకుని స్టేజ్ పైనే కన్నీరు కార్చింది.
ఈ క్రమంలోనే యంకర్ రష్మి, రీతూ తండ్రి గురించి గుర్తుచేయగా.. ఒక్కసారిగా స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యింది రీతూ. కన్నీరు కారుస్తూ..”రోజూ పుజ చేసే సాయిబాబా ఫోటో పక్కన మా నాన్న ఫోటో పెట్టుకోవాల్సి వచ్చింది” అని కన్నీరు కార్చింది. దాంతో షోలో ఉన్నవారందరు ఎమోషనల్ అయ్యి కన్నీరు కార్చారు. ఈ క్రమంలోనే అక్కడి వాతావరణం మెుత్తం ఒక్కసారిగా భావొద్వేగంతో నిండిపోయింది. రీతూ.. తండ్రి అకాల మరణంతో ఒక్కసారిగా కుంగుబాటుకు లోనైంది. తండ్రిపై ఉన్న ప్రేమను ఇలా కన్నీటి రూపంలో చూపిస్తోంది రీతూ.