తెలుగు రాష్ట్రాల్లో ఎందరినో అలరిస్తున్న జబర్దస్త్ షోకి సౌమ్య రావు అనే కొత్త యాంకర్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్స్ గా ఉండగా.. అనసూయ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆ షోకి కొత్త యాంకర్ వస్తోందంటూ రకరకాల యాంకర్ల పేర్లు వినిపించాయి. అయితే ఊహించని విధంగా రష్మీ గౌతమ్ నే యాంకర్ గా పెట్టారు. దీంతో రష్మీ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోస్ చేస్తూ వచ్చింది. ఇటీవల జబర్దస్త్ షో యాంకర్ గా రష్మీని తప్పించి సౌమ్య రావుని తీసుకున్నారు. అయితే తనను తీసేసి కొత్త యాంకర్ ను పెట్టుకోవడంపై రష్మీ గౌతమ్ సీరియస్ టీగా ఉందంటూ కథనాలు వచ్చాయి. తాజాగా సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించింది.
సౌమ్య రావుపై తనకు ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదని, తను రావడాన్ని స్వాగతిస్తున్నానని రష్మీ వెల్లడించింది. తను వస్తుందని తనకు ముందుగానే మల్లెమాల వారు చెప్పారని తెలిపింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళినప్పుడే తనకు కొన్ని రోజులే జబర్దస్త్ షో చేయమని చెప్పారని, ఆ తర్వాత వేరే యాంకర్ వస్తుందని ముందుగానే చెప్పారని వెల్లడించింది. మల్లెమాల సంస్థ తనకి హోమ్ ప్రొడక్షన్ లాంటిదని, తన సొంత సంస్థ లాంటిదని ఆమె వెల్లడించింది. ఒకవేళ సౌమ్య వేరే షోస్ తో బిజీగా ఉండి జబర్దస్త్ షోలు స్కిప్ చేసినా, క్విట్ చేసినా మళ్ళీ వెళ్తానని, హ్యాపీగా షో చేసుకుంటానని పేర్కొంది. ఈ విషయంలో సౌమ్య యాంకర్ కావడం వల్ల తనకు ఇబ్బంది లేదని, మల్లెమాల సంస్థ ఎప్పుడు పిలిచినా తాను సిద్ధమే అని వెల్లడించింది.