తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షోపై మొన్నటివరకూ పలు రకాల కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ లో పెట్టే ఫుడ్ విషయంలో కమెడియన్ కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. జబర్దస్త్ లో ఫుడ్ బాలేదని కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ ని కొట్టిపారేస్తూ.. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తిరిగి విమర్శలు గుప్పించారు. అయితే.. అటు ఆర్పీ మాటలపై, ఇటు ఆది, రాంప్రసాద్ కామెంట్స్ పై క్లారిటీ ఇస్తూ జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు క్లారిటీ ఇచ్చారు.
ఇదంతా ఓవైపు మాత్రమే జరిగింది. అయితే.. జబర్దస్త్ లోకి రీసెంట్ గా వెళ్లి కొద్దిరోజులకే బయటికి వచ్చిన రాకేష్ మాస్టర్ ఇదే విషయంపై మాట్లాడారు. జబర్దస్త్ లో ఫుడ్ బ్యాడ్ అని చెప్పిన రాకేష్ మాస్టర్.. కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వీడియోలో చూశానని, అతను ఫుడ్ విషయంలో చెప్పింది వాస్తవమేనని చెప్పడం గమనార్హం. జబర్దస్త్ ఫుడ్ విషయంలో బ్యాడ్.. ఏమైందో తెలీదు అంటూ రాకేష్ మాస్టర్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాకేష్ మాస్టర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.