సెలబ్రిటీ టాక్ షోలంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. ప్రతివారం షోకి వచ్చే సెలబ్రిటీల లైఫ్, కెరీర్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. టాక్ షోలలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఏదైనా ఉందంటే.. మొదటి స్థానంలో ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం ఉంటుంది. ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి సోమవారం రాత్రి ప్రసారమయ్యే ఈ షోకి.. ఎప్పటికప్పుడు కొత్త సెలబ్రిటీలు వస్తుంటారు. తాజాగా తదుపరి ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో ప్రముఖ నటి తులసి, నటుడు ప్రభాస్ శ్రీను హాజరయ్యారు.
ఇక షోలో కెరీర్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్న ప్రభాస్ శ్రీను.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా విషయాలు బయటపెట్టాడు. అయితే.. నటుడిగా ప్రభాస్ శ్రీను ఎంత కామెడీ పండించగలడో.. డాన్స్ కూడా అంతే బాగా చేయగలనని ప్రూవ్ చేశాడు. డాన్స్ చేస్తావా? అని హోస్ట్ ఆలీ అడగ్గా.. ‘పాట పెట్టండి ఎంతసేపైనా చేస్తూనే ఉండిపోతాను.. నాకు సాంగ్ సౌండ్ వినిపిస్తే చాలు’ అన్నాడు. దీంతో మైకేల్ జాక్సన్ సాంగ్ ప్లే చేయగా.. అలాంటి స్టైలిష్ స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. పూర్తి వీడియో చూడాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.