బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సీజన్ 7లోకి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షోలకు టాక్ షోలకు మంచి క్రేజ్ ఉంది. దాంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని షోలు ఉన్నప్పటికీ, వస్తున్నప్పటికీ ‘బిగ్ బాస్’ షోకు ఉన్న ఫాలోయింగే వేరు. గత ఆరు సీజన్లుగా బుల్లితెర అభిమానులను అలరిస్తోంది బిగ్ బాస్. ఇక ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుని త్వరలోనే 7వ సీజన్ లోకి అడగుపెట్టబోతోంది బిగ్ బాస్. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఓ మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సారి హౌజ్ లోకి ఓ విడాకులు తీసుకున్న స్టార్ సెలబ్రిటీ జోడీని రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్ ను క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సీజన్ కోసం యంకర్ రష్మిని సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఇంకో వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే? కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను బిగ్ బాస్ సీజన్ 7 హౌజ్ లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఆ జోడీ మరెవరో కాదు.. ర్యాప్ సాంగ్ లతో పాపులర్ అయిన నోయెల్, నటి ఎస్తేర్.
నోయెల్, ఎస్తేర్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని రోజులకే ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల కొద్ది కాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. అయితే బిగ్ బాస్ మరింత రసవత్తరంగా సాగడానికి మేకర్స్ మాస్టర్ ప్లాన్ తో వీరిద్దరిని హౌజ్ లోకి పంపేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి బిగ్ బాస్ టీమ్ వాళ్లు ఈ జంటను సంప్రదించినా ఒప్పుకుంటారో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.