కార్తీకదీపం.. ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్కప్పుడు బుల్లితెరనే కాదు సోషల్ మీడియాను కూడా ఒక ఊపు ఊపింది ఈ సీరియల్. అయితే డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తప్పించిన తర్వాత ఈ సీరియల్‌కు ఫాలోయింగ్ పడిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మళ్లీ పాత పాత్రలు అన్నీ తిరిగి సీరియల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాయి.
ఇప్పటికే వంటలక్క కోమా నుంచి బయటకు వచ్చినట్లు ప్రోమో కూడా విడుదల చేశారు. చాలా గ్యాప్ తర్వాత వంటలక్కను కార్తీకదీపం సీరియల్ లో చూడగానే అభిమానులు అంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. మోనిత కూడా తిరిగి కథలోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఇప్పుడు అంతా మరి.. డాక్టర్ బాబు పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఆ అప్ డేట్ కూడా వచ్చేసింది. తన ఎంట్రీపై స్వయంగా నిరుపమ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. అందరూ సిద్ధంకండి.. డాక్టర్ బాబు వచ్చేస్తున్నాడు అంటూ సెట్స్ లో ఉన్న ఫొటోలను రివీల్ చేశాడు. డాక్టర్ బాబు తలకు కట్టుతో కుర్చీలో కూర్చుని ఉన్న ఫొటో అది. కార్తీకదీపం సీరియల్ సెట్ లో షూట్ గ్యాప్‌లో దిగిన ఫొటోని నిరుపమ్ షేర్ చేశాడు.
ఇంకేముందు ఆ పోస్ట్ చూడగానే అభిమానులు అంతా హయ్ డాక్టర్ బాబు తిరిగి వస్తున్నాడు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే అప్పుడే సీరియల్ ఎలా మలుపు తరిగబోతోంది అంటూ స్టోరీ లైన్లు కూడా గెస్ కొట్టేస్తున్నారు. డాక్టర్ బాబు ఎంట్రీతో ఈ సీరియల్‌కి మళ్లీ పూర్వ వైభవం వస్తుందంటూ ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్ బాబు రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.