తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వినోద కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. లాక్ డౌన్ సమయం నుండే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాకుండా.. కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. వారవారం కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తున్న ఈ షోలో.. ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ ఆది’ బర్త్ డే స్పెషల్ అంటూ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక కొన్నివారాలుగా ఈ షోని యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తుండగా.. నటి ఇంద్రజ ఈ వారం జడ్జిగా వ్యవరించనుంది.
ఈ క్రమంలో జబర్దస్త్ యాజమాన్యమే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి.. అందులో కనిపించే కమెడియన్స్ ఇందులో కూడా కనిపిస్తారు. అలాగే పలువురు సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు కూడా హాజరవుతుంటారు. అయితే.. ఈ వారం హైపర్ ఆది తన బర్త్ డే అంటూ స్టేజిపై కామెడీతో పాటు శ్రీరామదాసు సినిమాలోని ఓ పాట పాడి ఆకట్టుకున్నాడు. ఓవైపు నూకరాజుతో కలిసి ఆది పాడిన పాట హైలెట్ అనుకుంటుంటే.. మరోవైపు నెల్లూరు కవిత అని మరో డాన్సర్ ని స్టేజిపై ప్రెజెంట్ చేశారు. ఈ స్టేజి ద్వారానే గాజువాక కండక్టర్ ఝాన్సీ డాన్సర్ గా మంచి పేరు, గుర్తింపు దక్కించుకుంది.
ఇప్పుడు తాను కూడా ఝాన్సీని మించిన టాలెంట్ తో వచ్చానని చెబుతూ.. స్టేజిపై ఝాన్సీకి పోటీగా చెలరేగిపోయింది నెల్లూరు కవిత. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఝాన్సీని మించిన టాలెంట్ అని కవిత ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే. అయితే.. మొన్న గాజువాక నుండి కండక్టర్ ఝాన్సీ.. తాజాగా నెల్లూరు నుండి కవిత.. శ్రీదేవి కంపెనీ స్టేజి ద్వారా మరో సెలబ్రిటీ కావడం ఖాయమేనని అంటున్నారు నెటిజన్స్. అలాగే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు షోని అభినందిస్తున్నా.. స్టేజిపై ఝాన్సీ, కవిత డాన్స్ చేసేటప్పుడు మేల్ కమెడియన్స్ వాళ్ళ దగ్గరకి వెళ్లి హంగామా చేయడం బాలేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.