గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి, నెల్లూరు కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పల్సర్ బైక్ పాటతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతను ఒక ఊపు ఊపేసింది గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఇక ఈమె తర్వాత నెల్లూరు కవిత వెలుగులోకి వచ్చింది. అప్పటి వరకూ ఝాన్సీనే తోపు అనుకున్న జనం.. నెల్లూరు కవిత పెర్ఫార్మెన్స్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది. రావడం రావడంతోనే హై వోల్టేజ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో నెల్లూరు కవిత అదరగొట్టేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఆ మధ్య ఝాన్సీకి,నెల్లూరు కవితకి మధ్య డ్యాన్స్ పోటీ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు నెల్లూరు కవిత.. ఝాన్సీని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.
ఝాన్సీ కన్నా మంచి డ్యాన్సర్లు చాలా మంది ఉన్నారని, ఇప్పుడు నా సత్తా చూపించడానికి మీ ముందుకు వచ్చానని, ఝాన్సీ కంటే బెటర్ డ్యాన్సర్ నని ప్రూవ్ చేస్తానని ఛాలెంజ్ విసిరింది. దీంతో ఝాన్సీ, కవిత మధ్య గొడవ మొదలైందని ఒక టాక్ నడిచింది. అయితే ఈ గొడవపై నెల్లూరు కవిత క్లారిటీ ఇచ్చారు. ఆరోజు ఝాన్సీని అలా అనడం, స్టేజ్ పైన ఛాలెంజ్ విసరడం అనేది పోటీలో భాగమే అని కవిత వెల్లడించింది. పోటీలో భాగంగా చేసిన వ్యాఖ్యలే తప్ప.. తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని ఆమె పేర్కొంది. షో అయిపోయిన తర్వాత మేము చాలా బాగుంటామని తెలిపింది. వైజాగ్ లో 20 ఈవెంట్లు జరిగితే.. అందులో 10 ఈవెంట్లు ఝాన్సీ అక్క, నేనూ కలిసే చేస్తామని కవిత వెల్లడించింది.