బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో కొత్త ప్రోగ్రామ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ తో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీ కపుల్స్ కి సంబంధించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ని తెరపైకి తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అలా రీసెంట్ గా మొదలైన సెలబ్రిటీ కపుల్స్ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రాంలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్.. జీ తెలుగు ఛానల్ లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అవుతోంది.
ఇక ప్రతివారంలాగే ఈ ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో ముందే వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కూడా ఆదివారం ప్రసారం అయిపోయింది. కాకపోతే ఇంకా పూర్తి ఎపిసోడ్ బయటికి రాలేదు. కాగా.. ఈ ప్రోగ్రాంలో గెస్టులుగా టాలీవుడ్ సింగర్ ధనుంజయ, లిరిక్ రైటర్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.. వారి ఫ్యామిలీస్ తో పాల్గొన్నారు. ఈ క్రమంలో అనూప్ రూబెన్స్ ఆయన భార్యను చాలా రేర్ గా కెమెరా ముందుకు తీసుకొస్తుంటారు. ఈ ప్రోగ్రాంలో సతీమణితో పాల్గొన్న అనూప్.. స్టేజ్ పై లవ్ ప్రపోజ్ చేసిన సీన్ వైరల్ గా మారింది. అంతేగాక భర్త ప్రపోజ్ చేసిన విధానం చూసి.. అనూప్ భార్య ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.