2022 నుండి 2023వ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే సమయం వచ్చేసింది. సినీ తారలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు, కమెడియన్స్ కూడా సరికొత్త ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఆల్రెడీ పాపులర్ అయినటువంటి ఎంటర్టైన్ మెంట్ షోలలో స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో అనిపించుకున్న జబర్దస్త్.. 2023లోకి ఎంటర్ అవ్వడంతోనే అరుదైన మైలురాయిని అందుకుంటోంది. అవును.. జబర్దస్త్ షో.. 500వ ఎపిసోడ్ కి చేరుకుంది. జనవరి 5న ప్రసారం కానున్న ఎపిసోడ్ తో జబర్దస్త్ 500వ ఎపిసోడ్ క్లబ్ లో చేరనుంది.
ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ.. ఏకంగా ఏపీ మంత్రి, నటి రోజాని గెస్ట్ గా ఆహ్వానించారు. జబర్దస్త్ కి రోజా అంటే.. శివగామి మాదిరే అని చెప్పాలి. సినిమాలకు దూరంగా ఉంటున్నా రోజాను జనాలు ఇంకా గుర్తుంచుకున్నారు.. అంటే దానికి కారణం జబర్దస్త్ షో. జడ్జిగా కొన్నేళ్లు అలరించిన రోజా.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ 500వ ఎపిసోడ్ కి రీచ్ అయిన స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో మంత్రి రోజా ఎప్పటిలాగే జడ్జి స్థానంలో కృష్ణభగవాన్, ఇంద్రజల పక్కన కూర్చొని స్కిట్స్ ఎంజాయ్ చేశారు.
ఇదిలా ఉండగా.. జబర్దస్త్ 500వ ఎపిసోడ్ కమెడియన్ రాకెట్ రాఘవకి ఎంతో స్పెషల్ గా మారనుంది. ఎందుకంటే.. జబర్దస్త్ మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు చాలామంది కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్నారు. షో ద్వారా సినిమా అవకాశాలు అందుకొని.. సినిమాలు కూడా చేసుకుంటున్నారు. కానీ.. జబర్దస్త్ లో మొదటి నుండి బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూ అవుతున్న టీమ్ లీడర్ రాకెట్ రాఘవ. అతనికి కూడా జబర్దస్త్ లో 500ల ఎపిసోడ్స్ పూర్తి కావడంతో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మంత్రి రోజా చేత రాఘవని సత్కరించారు. ప్రస్తుతం షోలో రాకెట్ రాఘవని సన్మానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవకి జరిగిన సన్మానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.