కారు కొనాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దీని కోసం ఎదగాలని అనుకుంటారు. కసిగా కష్టపడతారు. చివరకు అనుకున్నది సాధిస్తారు. అలాంటి వారిలో మెహబూబ్ దిల్ సే ఒకరు. రంజాన్ సందర్భంగా మెహబూబ్ దిల్ సే కొత్త కారును కొనుగోలు చేశారు. కొడుకు కొత్త కారు కొంటే ఆ తండ్రి కళ్ళలో ఆనందం చూడాలి భయ్యా. నిజంగా వెలకట్టలేని అనుభూతి అది.
ఈ భూమ్మీద దాదాపు చాలా మందికి ఉండే కామన్ డ్రీమ్స్ రెండే. ఒకటి ఇల్లు, రెండు కారు. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. సొంతింటి కల నిజమయ్యాక.. కారు కొనాలన్నా కలను నిజం చేసుకుంటారు. కారు కొనడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడుపుతారు. ఇంట్లో అమ్మ, నాన్నలను కారులో ఎక్కించుకుని తిప్పాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్టపడతారు. చివరకు కారు కొంటారు. కొన్నాక వచ్చే ఫీలింగ్ నిజంగా వెలకట్టలేనిది. ప్రస్తుతం ఇదే ఫీలింగ్ ని బిగ్ బాస్ కంటిస్టెంట్ మెహబూబ్ దిల్ సే అనుభవిస్తున్నారు. రంజాన్ సందర్భంగా కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసి కుటుంబ సభ్యులను సర్ప్రైజ్ చేశారు.
టిక్ టాక్ వీడియోలు, షార్ట్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సే.. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఈ సీజన్ లో గ్రాండ్ ఫినాలే వేదికగా చిరంజీవి చేతుల మీదుగా పది లక్షల రూపాయలను అందుకున్నారు. ఆ డబ్బును, తాను సంపాదించిన డబ్బు కలిపి గుంటూరులో సొంత ఇల్లు కట్టుకున్నారు. మరి ఇల్లు అన్నాక పార్కింగ్ లో కారు లేకపోతే అందం ఉండదు కదా. అందుకోసం డబ్బు దాచుకుని ఒక లగ్జరీ కారు కొనేశారు. రంజాన్ పండుగ సందర్భంగా రూ. 15 లక్షలు విలువైన మహీంద్రా ఎక్స్ యూవీ 700 కారును కొనుగోలు చేశారు. నలుపు రంగులో ఉన్న ఈ కారు ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. తన తండ్రి, సోదరులతో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నారు.
ఈ శుభ సందర్భంలో ప్రత్యేక ప్రార్థన చేయించారు. కుటుంబాన్ని గర్వపడేలా చేయడం, సంతోషపెట్టడం అనేది ఎప్పటికీ అత్యున్నతమైన అనుభూతి, ఈ ఫోటోలు చాలా మాట్లాడుతాయి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెహబూబ్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రవికృష్ణ, సోహైల్, శ్రీరామచంద్ర, అర్జున్ కళ్యాణ్, కాజల్ తదితరులు మెహబూబ్ కి అభినందనలు తెలియజేశారు. నెటిజన్స్ కూడా మెహబూబ్ కారు కొనడం పట్ల ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి సాధారణ స్థాయి నుంచి వచ్చి అసాధారణ స్థాయికి ఎదిగి.. సొంత ఇల్లు కట్టుకుని.. ఇవాళ కొత్త కారు కొన్న మెహబూబ్ కి మీరు కూడా అభినందనలు తెలియజేయండి.