సెలబ్రిటీల పెళ్లిళ్లకి, నిశ్చితార్థ వేడుకలకి బయట సొసైటీ ఆఫ్ సోషల్ మీడియాలో భలే క్రేజ్ ఉంటుంది. ఏ సెలబ్రిటీ పెళ్లి జరిగినా, ఎంగేజ్మెంట్ జరిగినా తమ ఇంటి వేడుకలా అభిమానులు ఫీలవుతుంటారు. కొంతమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పెళ్లిళ్లు, నిశ్చితార్థ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం చెప్పా పెట్టకుండా సైలెంట్ గా కానిచ్చేస్తుంటారు. అలా నటి త్రిష కూడా చెప్పా పెట్టకుండా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. అయితే సోషల్ మీడియా చూస్తూ ఊరుకోదుగా. పురావస్తు తవ్వకాల్లో వెలికితీసినట్టు ఫోటోలని బయటకు తీసి వైరల్ చేస్తుంటుంది. తాజాగా నటి త్రిష విషయంలో కూడా ఇదే జరిగింది.
వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నటి త్రిష.. ఇప్పుడు ‘మనసిచ్చి చూడు’ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ లో కీర్తికి చెల్లెలు రేణు పాత్రలో మెప్పించింది. ఈ సీరియల్ తర్వాత ఈ బ్యూటీ మరే సీరియల్స్ లోనూ నటించలేదు. పెళ్లి కుదిరిందని, అందుకే సీరియల్స్ మానేసిందని ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజమే అని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ ఫోటోలు చూస్తేనే అర్ధమవుతుంద. నటి త్రిష నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మనసిచ్చి చూ\డు సీరియల్ టీమంతా హాజరయ్యారు. త్రిషకి శుభాకాంక్షలు తెలియయజేశారు. త్రిష పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు విశాల్. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.