తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న కామెడీ షోలలో ‘ఎక్స్ ట్రా జబర్దస్త్‘ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ ఇంద్రజ, ఖుష్బూ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ప్రతివారం లాగే ఈ వారం కూడా కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి ప్రోమో అంతా అందరి పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంది. ముఖ్యంగా గెటప్ శ్రీను యముడి గెటప్ లో కైకాల సత్యనారాయణ గారి గాత్రాన్ని ఇమిటేట్ చేసిన విధానం అలరించింది.
ఈ క్రమంలో అందరి పెర్ఫార్మన్స్ ల తర్వాత ఎలాగో క్లైమాక్స్ లో ఏదొక ట్విస్ట్ ఉంటుందిగా.. ఈ వారం ప్రోమో చివరిలో అందరూ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టేశారు. అయితే.. అందరి డ్యాన్స్ రెగ్యులర్ గా అనిపించినప్పటికీ.. జడ్జిలు ఇంద్రజ, ఖుష్బూలు యాంకర్ రష్మీతో కలిసి చేసిన మాస్ డ్యాన్స్ విపరీతంగా జనాలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి ఇంద్రజ, ఖుష్బూల డ్యాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.