'జబర్దస్త్' రాకేష్ పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నాళ్ల నుంచి తను ప్రేమిస్తున్న యాంకర్, నటి సుజాతతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
‘జబర్దస్త్’తో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమించిన సుజాతతో ఏడడుగులు వేశాడు. ఇరుకుటుంబసభ్యులు, ‘జబర్దస్త్’ కమెడియన్స్ వాళ్ల ఫ్యామిలీస్ తో హాజరైన ఈ వేడుక తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. అలానే నూతన వధూవరులకు అందరూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. అయితే అసలు రాకేష్-సుజాత లవ్ స్టోరీ ఏంటి? వీళ్లు ఎప్పుడు కలిశారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కుటుంబంతో పాటు దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చేసిన రాకేష్, మిమిక్రీ-వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చోట్లు షోలు చేసి ఫేమ్ తెచ్చుకున్న రాకేష్.. ధనరాజ్ టీమ్ లో ఓ సభ్యుడిగా ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్లకు కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆర్పీ వెళ్లిపోవడంతో సింగిల్ టీమ్ లీడర్ గా మారిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్నేళ్లపాటు తనదైన కామెడీ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
కొన్నేళ్ల ముందు వరకు ఎక్కువగా పిల్లలతో స్కిట్స్ చేసిన రాకేష్.. ఆ తర్వాత అందరిలానే స్కిట్స్ చేస్తూ వచ్చాడు. మరోవైపు ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ గా పనిచేసిన సుజాత, ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని క్రేజ్ బాగానే తెచ్చుకుంది. రాకేష్ తో ఈమెకు ముందు నుంచి పరిచయం ఉంది. అయితే ఆమె కూడా ‘జబర్దస్త్’ షోలో అడుగుపెట్టడం, రాకేష్ టీమ్ లోనే స్కిట్స్ చేస్తూ వచ్చింది. అలా ‘జబర్దస్త్’ కోసం కలిసిన వీరిద్దరూ.. రీల్ జోడీగా కాస్తో కూస్తో ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నిజంగా జోడీగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రాకేష్-సుజాత జంటకు మీ ఆశీర్వాదాలు కూడా కింద కామెంట్స్ లో చెప్పండి.