బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న వినోదాత్మక కార్యక్రమాలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటేనే సెలబ్రిటీల రచ్చ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు విశేషంగా ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు ఏదో విధంగా వివాదాలకు కారణం అవుతుంటారు. ప్రెజెంట్ టీవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' ఒకటి.
బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న వినోదాత్మక కార్యక్రమాలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటేనే సెలబ్రిటీల రచ్చ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు విశేషంగా ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు ఏదో విధంగా వివాదాలకు కారణం అవుతుంటారు. ప్రెజెంట్ టీవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ ఒకటి. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో.. జీ తెలుగు ఛానల్ లో ప్రతి ఆదివారం ప్రసారం అవుతోంది. కాగా.. తాజాగా వచ్చే ఆదివారానికి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఇక ప్రోమో అంతా జబర్దస్త్ ఆర్టిస్ట్ లతో సందడిగా సాగింది. అయితే.. ప్రోమో అంతా సరదాగా సాగినప్పటికీ.. జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర నోటి వెంట వచ్చిన బూతు మాట చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఈ షోలో పవిత్ర.. తన టీమ్ లీడర్ బుల్లెట్ భాస్కర్ కి జంటగా వచ్చింది. అయితే.. ఓ గేమ్ లో భాగంగా పవిత్ర ఇచ్చిన క్లూస్ ద్వారా భాస్కర్.. ఆమె చెప్పాలి అనుకుంటుందో కరెక్ట్ గా గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పవిత్ర ఇచ్చిన క్లూకి భాస్కర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆమె.. ‘నీయక్క’ అని తిట్టేసింది. ప్రస్తుతం పవిత్ర భాస్కర్ ని అలా బూతు మాట అనడం హాట్ టాపిక్ గా మారగా.. ఆమె అలా అనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి జబర్దస్త్ పవిత్ర అలా తన టీమ్ లీడర్ ని తిట్టడం కరెక్టేనా..? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.