బుల్లితెరలో జబర్దస్త్ టాప్ రేటెడ్ కామెడీ షో అని అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ షోకి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. మొన్నటి వరకూ ఉన్న ఎంతో మంది సీనియర్లు షోని వదిలేసి వెళ్లిపోయారు. కొందరైతే నెట్టింట ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు సీనియర్ కమీడియన్లు కూడా మళ్లీ తిరిగి షోకి రావడం చూస్తున్నాం. ఈ షో ద్వారా ఎంతో మంది వెండితెరకు కూడా పరిచయం అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం కావడంలో ఈ షో కీలకపాత్ర పోషించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవలే స్టార్ యాంకర్ అనసూయ ఈ షోని వదిలివెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్లు యాంకర్ రష్మీ చేసింది. తర్వాత మరో కొత్త యాంకర్‌ని పరిచయం చేశారు. ఆమె ఎంట్రీ తర్వాత మళ్లీ షో పుంజుకుంటోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సౌమ్య రావు కన్నడ అమ్మాయి. సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడిని కొత్త యాంకర్‌గా పరిచయం చేశారు. జబర్దస్త్ లాంటి షోలో యాంకర్‌గా చేయాలి అంటే అందంగా ఉంటే సరిపోదు.. కామెడీ టైమింగ్ కూడా ఉండాలి. ఆ విషయంలో సౌమ్యరావు సరైన ఎంపిక అని ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది. టీమ్ లీడర్లు వేసే పంచులకు సరిగ్గా రివర్స్ లో కౌంటర్లు ఇస్తోంది. అటు అందంతోనే కాకుండా ఇటు కామెడీతో కూడా ఆకట్టుకుంటోంది.
అయితే ఇప్పుడు సౌమ్య రావ్‌కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. జబర్దస్త్ కి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే సౌమ్య రావ్‌ను ఓ టాప్ కమీడియన్ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడంట. ఈ గ్యాప్‌లోనే నంబర్ తీసుకుని చాటింగ్ చేయడం, లంచ్‌కి వెళ్దాం అంటూ మెసేజ్ లే చేస్తున్నాడట. అయితే ఈ విషయంపై సౌమ్యరావ్ మాత్రమే కాదు.. యాజమాన్యం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. షోలో ఎన్ని పంచులు వేసినా.. బయట మాత్రం పద్ధతిగా ఉండాలని అందరినీ హెచ్చరించారట. సదరు కమీడియన్‌ని పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.