జబర్దస్త్ ప్రేమ జంటలకు పెట్టింది పేరులా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జబర్దస్త్ ఐశ్వర్య తనకు కాబోయే భర్త ఇతడే అంటూ ఓ యువకుడిని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ 10 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలను కడుపుబ్బా నవ్విస్తున్న షో ఏదైనా ఉంది అంటే అది ఒక్క జబర్దస్త్ మాత్రమే. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జబర్దస్త్ మేకర్స్ సైతం ఎప్పటికప్పుడు కొత్తకొత్త కాన్సెప్ట్ లను తెరపైకి తీసుకొచ్చి అభిమానులను అలరిస్తుంటారు. అదీకాక జబర్దస్త్ ప్రేమ జంటలకు పెట్టింది పేరులా మారిపోయింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో జబర్దస్త్ ఐశ్వర్య తనకు కాబోయే భర్త ఇతడే అంటూ ఓ యువకుడిని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
జబర్దస్త్ ఐశ్వర్య.. ఢీ షో ద్వారా డ్యాన్సర్ గా పరిచయం అయ్యి.. ఆ తర్వాత జబర్దస్త్ షోలో తనకంటూ ఓ క్రేజ్ ను తెచ్చుకుంది. హైపర్ ఆది టీమ్ లో ఒన్ ఆఫ్ ది లీడింగ్ కంటెస్టెంట్ గా ప్రస్తుతం ఐశ్వర్య చేస్తోంది. ఆది టీమ్ తో పాటుగా రాఘవ టీమ్ లో సైతం అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది ఈ భామ. అదీకాక స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రాకెట్ రాఘవతో రొమాంటిక్ సాంగ్స్ చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ మేకర్స్ ఏప్రిల్ 13వ తేదీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో కమెడియన్స్ ఎప్పటిలాగే పంచులతో అభిమానులను అలరించారు. అయితే ఈ ఎపిసోడ్ కు హైలెట్ మాత్రం జబర్దస్త్ ఐశ్వర్య అనే చెప్పాలి. ఎందుకంటే?
జబర్దస్త్ స్టేజ్ పై తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. ” నాకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ స్టేజ్ పై నా లైఫ్ పార్ట్ నర్ ను మీకు పరిచయం చేస్తాను” అంటూ అతడిని పిలిచింది. అతడి పేరు శ్రీనివాస్ సాయి. అదీకాక స్టేజ్ పై ఐశ్వర్యకు తాళి కూడా కట్టాడు అతడు. దాంతో ఈ కొత్త జంటకు జబర్దస్త్ జడ్జిలు ఇంద్రజ, కృష్ణభగవాన్ లు శుభాకాంక్షలు చెప్పారు. ఇక శ్రీనివాస్ సాయి కొన్ని జబర్దస్త్ స్కిట్స్ లల్లో కనిపించినట్లు తెలస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు ఇది టీఆర్పీ స్టంట్ గా చెప్పుకొస్తున్నారు. మరికొంత మంది మాత్రం నిజంగానే ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఐశ్వర్య-శ్రీనివాస్ సాయి జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.