'జబర్దస్త్' ఐశ్వర్య తన ప్రేమని బయటపెట్టేసింది. ఆయనంటే చాలా ఇష్టం అని చెప్పేసింది. ఆయన కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధమని క్లారిటీ ఇచ్చేసింది.
‘జబర్దస్త్’ షోతో చాలామంది పాపులర్ అయ్యారు. ఒకప్పుడు మేల్ కమెడియన్స్ ఎక్కువగా ఉండేవారు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం లేడీస్ కూడా కనిపిస్తున్నారు. రోహిణి, ఐశ్వర్య, రీతూ చౌదరి, వర్ష తదితరులు తమ కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీళ్లతో పాటు మరికొందరు అమ్మాయిలు కూడా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు స్పెషల్ ఎపిసోడ్స్ లోనూ సందడి చేస్తున్నారు. వీళ్లలో ఒకరైన ఐశ్వర్య.. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఓ ఛానెల్ తో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీ అని క్లారిటీ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మోడలింగ్స్, ఈవెంట్స్ తో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత సీరియల్స్ లో నటించింది. ఎప్పుడైతే ‘జబర్దస్త్’లోకి అడుగుపెట్టిందో ఆమె ఫేట్ మారిపోయింది. ఎక్కువగా హైపర్ ఆది స్కిట్స్ లో కనిపిస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని రూమర్స్ వచ్చాయి. కానీ హైపర్ ఆది తనకు చాలా ఇష్టం, గౌరవం అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అయితే తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని.. అమ్మ ప్రేమని మించిన ప్రేమ దొరికితే అప్పుడు ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టింది.
‘టాలీవుడ్ లో నేను అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన్ని కలిసే ఛాన్సులు వచ్చినా సరే కలవలేకపోయాను. నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కలవాలనేది నా ఆశ. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి పవన్ సినిమాలో యాక్ట్ చేయాలనేది నా డ్రీమ్. అయితే దీనికి ఓ కండీషన్ ఉంది. ఆయన సినిమాలో పనిమనిషి క్యారెక్టర్ అయిన చేస్తాను గానీ అక్క, చెల్లి క్యారెక్టర్స్ మాత్రం అస్సలు చేయను. పవన్ కల్యాణ్ గారి కోసం ఏం చేయడానికైనా రెడీ. ఆయనంటే అంత క్రష్ నాకు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఆయనే నా స్ఫూర్తి’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. మరి ఈ వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.