బుల్లితెరపై పాపులర్ అయిన కామెడీ షోలలో జబర్దస్త్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. అలా ఎక్సట్రా జబర్దస్త్.. ఈ మధ్యకాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ బాగా పాపులర్ అయ్యాయి. ఇంకా ఢీ షో గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెర డాన్స్ రియాలిటీ షోలలో ఇదే మొదటిది. అయితే.. ఈ షోలన్నింటి ద్వారా జనాలకు దగ్గరైన వారిలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రష్మీ ముందుంటారు. కానీ.. ఈ ముగ్గురు కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం జబర్దస్త్ లోనే అని చెప్పాలి. యాంకర్ గా రష్మీ, టీమ్ లీడర్స్ గా సుధీర్, ఆది క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ షోలో అయినా ఎక్కువకాలం కంటిన్యూ చేసి ఒక్కసారిగా ఛానల్ మారిపోతే.. వచ్చే విమర్శలు తీవ్రస్థాయిలో ఉంటాయి.
విమర్శలు అనేవి నెటిజన్స్ చేస్తే ఒకలా ఉంటాయి.. అదే తమతో పాటు స్కిట్స్ చేసిన వారు ట్రోల్ చేస్తే మరోలా ఉంటాయి. ఈ మధ్య సుధీర్ ని ఉద్దేశించి హైపర్ ఆది వేసే పంచులు అలాగే ఉంటున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లలో టీమ్ లీడర్ గా కామెడీ స్కిట్స్ చేస్తూ.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోని హోస్ట్ గా నడిపించిన సుధీర్.. సడన్ గా వేరే ఛానల్స్, ప్రోగ్రామ్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. సుధీర్ షోలో ఉండటం.. వేరే ఛానల్ కి వెళ్లడం అనేది అతని పర్సనల్ ఛాయస్. కానీ.. అక్కడినుండి మళ్లీ గెస్ట్ గా జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు వస్తే.. హైపర్ ఆది టార్గెట్ చేసి మరి పంచులు వేశాడు.
అదే పనిగా పక్క ఛానల్ వాళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు? అని ఇమ్మానుయేల్ కూడా అవమానించాడు. అయినా సుధీర్ సైలెంట్ గా భరిస్తూనే వచ్చాడు. కానీ.. సుధీర్ లైట్ తీసుకున్నా.. అభిమానులు మాత్రం ఊరుకోవట్లేదు. సోషల్ మీడియా వేదికగా అప్పుడే హైపర్ ఆదిని ట్రోల్ చేశారు. అయినా ఆది సుధీర్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేయడం మానలేదని.. వేరే ఛానల్ నుండి వచ్చాక మళ్లీ ఎక్కడ కనిపించినా టార్గెట్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. అయితే.. అదంతా అప్పుడే అయిపోయిందేమో అనుకుందామంటే.. తాజాగా మళ్లీ టార్గెట్ చేస్తూ చెలరేగిపోయాడని సుధీర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
సరే అది అయిపోయింది.. ఇక ఒకసారి బయటికి వెళ్లిపోయి మళ్లీ తిరిగి వస్తే ఇలాగే ఉంటుందని అనుకున్నారు సుధీర్ ఫ్యాన్స్. కానీ.. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో మరోసారి హైపర్ ఆది.. సుధీర్ ని టార్గెట్ చేస్తూ పంచులు వేశాడని అంటున్నారు. లేటెస్ట్ ప్రోమోలో ఆది తన స్కిట్ లో.. ఇక్కడ ఫేమ్ సంపాదించుకున్నవారు పక్క రాజ్యాలకు ఎందుకు వెళ్తున్నారు? అని అడగ్గా.. “అక్కడేదో ఉంటుందని” అన్నాడు. మరి మళ్లీ తిరిగి ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? అనగానే.. ‘అక్కడేం లేదని తెలుసుకొని’ అంటూ పంచులు వేశాడు. దీంతో ఇప్పుడు సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీని ఉద్దేశించే ఆది ఇలా కామెంట్స్ చేశాడని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఆది మాటలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.