ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తులసి- సామ్రాట్ ఒక టీమ్ నందు- లాస్య ఒక టీమ్ గా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 7న ఎపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా మారబోతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో తులసి ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోతుంది. ఆమె కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఎపిసోడ్ మొత్తం ఎంతో భావేద్వేగంతో సాగుతుంది. అసలు జనవరి 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
తులసితో మాట్లాడుతూ సామ్రాట్.. నందు- లాస్య వాళ్ల బిజినెస్ డీల్ గురించి చెప్తాడు. వాళ్లు బెనర్జీతో వ్యాపారం చేసేందుకు సిద్ధపడుతున్నారని తెలుసుకుని తులసి కంగారు పడుతుంది. వెంటనే లాస్య- నందులను కలిసేందుకు ఇంటికి వెళ్తుంది. ఆమెను చూసి లాస్య నిన్నేగా చూశావ్ మళ్లీ అప్పుడే వచ్చావ్.. అంటూ పెదవి విరుస్తుంది. అవును మిస్ అవుతున్నాను అంటూ తులసి కూడా కౌంటర్ వేస్తుంది. తులసి మాట్లాడబోయేలోపే.. ఆ బెనర్జీ మంచివాడు కాదు, అతనితో బిజినెస్ వద్దు అని చెప్పడానికి వచ్చావా అంటూ కామెంట్ చేస్తుంది.
నువ్వు చమత్కారంగా అన్నా కూడా అదే నిజం. ఆ బెనర్జీ గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. అతను అంత మంచివాడు కాదు. సామ్రాట్ గారు వద్దు అంటేనే మీ దగ్గరకు వచ్చాడు. వెెంటనే కలగజేసుకున్న లాస్య.. బలిచక్రవర్తిగా మమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నావా? మేము ఎదిగితే మీకు నచ్చదు. మేము ఎక్కడ బాగుపడిపోతామో అని అడ్డుపడాలని చూస్తున్నావా. నువ్వు ఆ సామ్రాట్ కావాలనే ఇలా చేస్తున్నారు అంటూ లాస్య ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
లాస్యతో మాట్లాడి ఉపయోగం లేదని.. నందుతో చెబుతుంది. మీరైనా వినండి ఆ బెనర్జీ మంచివాడు కాదు. తులసి మాట్లాడుతుండగానే నందు సీరియస్ అవుతాడు. అడిగినప్పుడు సలహాలు ఇస్తే విలువ ఉంటుంది. అడకుండా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను తీసుకున్న తప్పు నిర్ణయం. పిల్లల ముందు నన్ను ఒక చేతకాని తండ్రిగా నిలబెట్టావు. నన్ను చేతకాని వాడిగా నిరూపించడానికి చాలా కష్టపడుతున్నావు కదా.. అది జరగనివ్వను అంటూ నందు మాట్లాడతాడు.
ఇక చేసేది లేక.. తులసి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఆ లాస్య అంటే వినదు. నందగోపాల్ ఎందుకు వినడం లేదు. మంచి చెప్పినా వినరేంటి. నా కుటుంబం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నేను అది జరగనివ్వను. అలా జరగకుండా ఆపాలి అంటూ ప్రేమ్ కి ఫోన్ చేయాలని చూస్తుంది. వెంటనే కళ్లు తిరిగి కింద పడిపోతుంది. ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేయడు. తర్వాత అభికి కూడా కాల్ చేస్తుంది. వాళ్లంతా క్యారమ్స్ ఆడుకుంటూ ఫోన్స్ చూడరు. చివరికి తులసి సామ్రాట్ కి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసే సరికి తులసి స్పృ కోల్పోతుంది. సామ్రాట్ కి తులసి వాయిస్ వినిపించక మళ్లీ కాల్ చేస్తాడు. ఆమె లిఫ్ట్ చేయకపోయే సరికి ఇంటికి వస్తాడు.
సామ్రాట్ వచ్చి చూసేసరికి ఇల్లు లాక్ చేసి ఉంటుంది. ఫోన్ రింగ్ వినిపించినా తులసి లిఫ్ట్ చేయకపోవడంతో కిటికీ లోనుంచి చూస్తాడు. తులసి పడిపోయి కనిపిస్తుంది. డోర్ గుద్దుకుంటూ సామ్రాట్ లోపలికి పరుగున వెళ్తాడు. తులసిని తీసుకుని వెంటనే ఆస్పత్రికి వెళ్తాడు. వైద్యులు ఆమె పరిస్థితి సివియర్ గా ఉందని మేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తారు. గార్డియన్, భర్త ఎవరైనా సంతకం పెట్టాలని చెబుతారు. సామ్రాట్ భర్త కాదని చెబిితే ట్రీట్మెంట్ చేయరని ధైర్యం చేసి భర్తగా సంతకం పెడతాడు. తర్వాత తులసి తమ్మడు కాల్ చేయగా విషయం చెబుతాడు.
తులసి తమ్ముడు అక్కని జాగ్రత్తగా చూసుకోండి సామ్రాట్ గారు మేము వచ్చేస్తున్నాం అని చెబుతాడు. విషయం తెలుసుకున్న తులసి కుటుంబం ఆస్పత్రికి బయల్దేరతారు. తులసి ఆరోగ్యం ప్రమదాకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతారు. పల్స్ కూడా అందడంలేదని సామ్రాట్ కంగారుగా ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోగా.. రేపు ఎపిసోడ్ ప్రోమోలో తులసి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతారు. తులసి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు చెబుతున్నారు.