శ్రీదేవి డ్రామా కంపెనీ.. మట్టిలో ఉన్న మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ షో. రకరకాల కాన్సెప్ట్ లతో రెండు రాష్ట్రాల బుల్లితెర అభిమానులను అలరిస్తు దూసుకెళ్తోంది. తాజాగా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్బంగా.. డిసెంబర్ 19కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఇద్దరు జబర్దస్త్ యాంకర్స్ తమ మాస్.. క్లాస్ డ్యాన్స్ లతో స్టేజీని దద్దరిల్లేలా చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం జడ్జి ఇంద్రజ అనే చెప్పాలి. తన తియ్యటి గాత్రంతో మరోసారి మెస్మరైజ్ చేసింది. ప్రొఫెషనల్ సింగర్స్ కు ఏమాత్రం తీసిపోకుండా పాట పాడి శభాష్ అనిపించుకుంది.
నటి ఇంద్రజ.. 90వ దశకంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ మత్తుకళ్ల సోయగం ఇంద్రజ. అప్పట్లో యువకుల కలల రాకుమారిగా పేరొందింది. రానురాను సినిమాలు తగ్గించేసిన ఇంద్రజ.. అప్పుడప్పుడు తల్లి క్యారక్టర్లలో కనిపించేది. ఇక గత కొంతకాలంగా జబర్దస్త్ జడ్జిగా అలరిస్తోంది. జబర్దస్త్ తో పాటుగా మరో బుల్లితెర పాపులర్ షో అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరుస్తోంది. తాజాగా ఈ షో 100వ ఎపిసోడ్ ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన తియ్యటి గాత్రంతో అభిమానులను మరోసారి అలరించింది ఇంద్రజ. గత ఎపిసోడ్ లో తన మాస్ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఇంద్రజ.. ఈ సారి కోకిలలా పాడి అద్భుతం చేసింది.
”ఏదో ఒకరాగం పిలిచింది ఈ వేళ” పాటను పాడుతుంటే అక్కడున్న ప్రతీ ఒక్కరు మైమరచిపోయారు. కళ్లుమూసుకుని ఈ పాట వింటే కచ్చితంగా ఇంద్రజ పాడింది అనుకోరు. ఎవరో ప్రొఫెషనల్ సింగర్ పాడుతుంది అనుకుంటారు. అంతలా తన గొంతుతో మెస్మరైజ్ చేసింది. ”ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ” అనే మరోపాట కూడా పాడింది. ఈ ఎపిసోడ్ లో యాంకర్స్ డ్యాన్స్ వల్ల స్టేజి దద్దరిల్లితే.. ఇంద్రజ పాటవల్ల అక్కడి వారి మనసులు సంగీత సామ్రాజ్యంలో సేదతీరాయి. ఇంద్రజ పాటపై అక్కడ ఉన్నవారందరు ప్రశంసలు కురింపించగా.. ఆది మాత్రం ఇంద్రజ.. భాను శ్రీ పాడిన పాట అప్పుడు ఇంద్రజ ఇచ్చిన కామెంట్ నే మళ్లీ రిపీట్ చేసి అక్కడ నవ్వులు పూయించాడు.