బుల్లితెరపై అలరించే కామెడీ షోలలో ఎప్పుడైనా సరే జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోను అనుసరించి వేరే షోలు ఎన్నో వచ్చాయి. అయితే.. ఎన్ని షోలు వచ్చినా జబర్దస్త్ ని మాత్రం బీట్ చేయలేవనే చెప్పాలి. ఎందుకంటే.. జబర్దస్త్ కి ఆ రేంజిలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ షోలో జడ్జిలు ఎందరో మారుతూ వస్తున్నారు. కొన్ని వారాలుగా జబర్దస్త్ కి జడ్జిలుగా నటి ఇంద్రజ, కమెడియన్ కృష్ణభగవాన్ కంటిన్యూ అవుతున్నారు. యాంకర్ రష్మీ షోని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రతివారం మాదిరే ఈ వచ్చే ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో వదిలారు జబర్దస్త్ నిర్వాహకులు. ప్రోమో అంతా ఎంటర్టైనింగ్ గానే సాగింది. కానీ.. మధ్యలో ఓ కమెడియన్ స్టేజి పైకి వచ్చి.. సూపర్ మచ్చి పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో జడ్జి ఇంద్రజ అందుకొని ఏం తవ్వుతున్నావ్.. ఒకటే తవ్వకం అంది. ఇంతలో కృష్ణభగవాన్.. ‘అయినా బాగుంది’ అన్నాడు. దీంతో ఇంద్రజ.. “అంతకంటే వరస్ట్ గా ఈయన చేస్తారు కాబట్టి బాగుంది అంటున్నారు” అని కృష్ణభగవాన్ ని చూపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఎలాంటి కామెడీ క్రియేట్ చేశారో!