‘జబర్దస్త్’ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత తొమ్మిదేళ్ల నుంచి టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ ప్రోగ్రాంపై చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ అవేవి కూడా టీవీ రేటింగ్స్ పై ప్రభావం చూపలేకపోతున్నాయి. టీమ్ లీడర్స్, జడ్జిలు.. ఎంతమంది మారుతున్నా సరే షోలో ఎంటర్ టైన్ మెంట్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. 2013లో ‘జబర్దస్త్’ షో మొదలైనప్పుడు చంటి, రాఘవ, ధన్ రాజ్, వేణు తదితరులు టీమ్ లీడర్స్ గా చేశారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అంటే రెండో జనరేషన్ లో సుధీర్, ఆది తదితరులు టీమ్ లీడర్స్ అయ్యారు. వీళ్లిద్దరూ షోని మరో స్థాయిలోకి తీసుకెళ్లారు.
చెప్పాలంటే ‘జబర్దస్త్’లో ఆది, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో సుధీర్ స్కిట్స్ కోసం తెగ వెయిట్ చేశారు. కొన్నాళ్ల ముందు ఆది.. ఈ షోకి బ్రేక్ ఇవ్వగా, ఆ తర్వాత కొన్నాళ్లకు సుధీర్ షో నుంచి పూర్తిగా బయటకెళ్లిపోయాడు. దీంతో రామ్ ప్రసాద్ టీమ్ లీడర్ అయ్యాడు. భాస్కర్, రాఘవ, రాకేశ్ లాంటి వాళ్లు స్కిట్స్ చేస్తూ అలరించేవాళ్లు. ముందుతో పోలిస్తే స్టార్ కమెడియన్స్ లేకపోవడంతో షో చూసేవాళ్లు తగ్గిపోయారు. అలా ఉండగా గెటప్ శ్రీను.. ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చాడు. ఆటో రాంప్రసాద్ తో కలిసి స్కిట్స్ చేస్తున్నారు.
మరోవైపు ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలు చేస్తున్న ఆది.. ‘జబర్దస్త్’లో ఎందుకు చేయట్లేదా అని చాలామందికి డౌట్. ఇప్పుడు ఆ సందేహాలన్నీ క్లియర్ చేస్తూ.. ఈ షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది.. ‘జబర్దస్త్’లోకి వస్తూ వస్తూనే జడ్జి ఇంద్రజ, యాంకర్ రష్మీపై పంచుల దాడి చేశాడు. దీంతో వచ్చే వారం హైపర్ ఆది స్కిట్ ఓ రేంజ్ లో టపాసులా పేలడం పక్కా అని తెలుస్తోంది. మరోవైపు ఆది… ఈ ఒక్క వారం కోసమైతే రాలేదు కదా అని కూడా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇకపోతే హైపర్ ఆది రీఎంట్రీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: స్టేజిపై తన లవ్ స్టోరీ బయటపెట్టిన హైపర్ ఆది.. వీడియో వైరల్!