తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇప్పుడు నటి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే.. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఎప్పటిలాగే ప్రోమో చాలా సందడిగా సాగింది. అదీగాక ఈ వారం ‘జోడి నెం.1’ కాన్సెప్ట్ తో ఎపిసోడ్ జరగనుంది. ఈ ఎపిసోడ్ లో అందరూ తమ తమ జోడిలతో స్టేజిపై ఎంటర్టైన్ చేశారు. రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఓ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.
ఆ తర్వాత పంచ్ ప్రసాద్ తన భార్యతో షోలో హాజరయ్యాడు. అయితే.. వీరి లవ్ స్టోరీకి సంబంధించి స్టేజిపై చేసిన ఓ స్కిట్ అందరినీ ఎమోషనల్ చేసిందనే చెప్పాలి. అనంతరం అందరూ జోడిలతో కలిసి మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారు. ఈ గేమ్ లో హైపర్ ఆది తన జోడీతో అందరినీ నవ్వించాడు. అయితే.. గేమ్ తర్వాత యాంకర్ రష్మీ అందరికి లవ్ గిఫ్ట్స్ వచ్చాయని.. అందులోనూ హైపర్ ఆదికి కూడా వచ్చినట్లు చెప్పింది. దీంతో గిఫ్ట్ ఓపెన్ చేసిన ఆది.. అందులో ఉన్న లవ్ లెటర్ చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు.
ఇదిలా ఉండగా.. అప్పటివరకు అమ్మాయిలతో డాన్స్ చేస్తూ సందడి చేసిన ఆది.. ఆ లెటర్ చూసి కంటతడి పెట్టుకునేసరికి అందరూ ఏమైందని కంగారు పడ్డారు. కానీ.. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు రాసుకున్న మొదటి లవ్ లెటర్ ఇదేనని చెబుతూ.. ఆ లెటర్ లో ఏముందో చదివి వినిపించాడు ఆది. అలా టీనేజ్ లో జరిగిన తీపి గుర్తును తలచుకొని హైపర్ ఆది ఎమోషనల్ అవ్వడం ప్రోమోలో హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది కంటతడి పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.