తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే షోలలో ఢీ షో ఒకటి. 13 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో 14వ సీజన్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ ఢీ 14 షోకి యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా చేస్తుండగా.. జానీ మాస్టర్, పూర్ణ, శ్రద్ధాదాస్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో రిలీజైంది. ప్రతీ వారం అదిరిపోయే థీమ్‌లతో, అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకునే ఢీ షో ఈ వారం కూడా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉంది. లవ్ థీమ్‌తో చేసిన డ్యాన్సులు అలరించనున్నాయి. ఈ షోలో హైపర్ ఆది లవ్ స్టోరీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
లవ్ థీమ్‌లో భాగంగా షోలో పార్టిసిపెంట్స్ తమ ఫస్ట్ లవ్ గురించి స్టేజ్ మీద పంచుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆది తన మొదటి లవ్ గురించి వెల్లడించారు. 8వ తరగతి వరకూ ఆది తన ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలో చదివానని, 9వ తరగతి కోసమని ప్రైవేట్ స్కూల్‌కి మారానని, అప్పుడు ఒక అమ్మాయి వచ్చిందని చెప్తూ మురిసిపోయారు. క్లాస్ నుండి బయటకు వస్తుండగా ఆ అమ్మాయిని చూశానని, ఆ ఫీలింగ్‌ని వర్ణించలేనంటూ సిగ్గుపడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ ఆగస్ట్ 24న ప్రసారం కానుంది. మరి ఫస్ట్ లవ్ గురించి హైపర్ ఆదిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: ఈటీవీలోకి సుధీర్ రీ ఎంట్రీ! వెళ్లినంత ఫాస్ట్ గా వెనక్కి!