తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ఆడియెన్స్ ను ఆలరించే టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. అలానే పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఈ షోను మరింత ఆసక్తికరంగా ఉండేలా మేకర్స్ రెడీ చేస్తారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో హైపర్ ఆది ఓ సంచలన కామెంట్స్ చేశాడు. తాను జబర్దస్త్ మానేయడానికి సౌమ్యరావు కారణం అంటూ అందరి ముందు స్టేజిపై చెప్పాడు. దీంతో అక్కడి నటీనటులు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైపర్ ఆది గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన కామెడీ పంచ్ లతో అందర్ని ఆకట్టుకుంటాడు. ట్రెండ్ కి తగినట్లు తనదైన పంచ్ లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు ప్రత్యేక ఈవెంట్స్ లో తనదైన శైలిలో అదరగొడుతున్నాడు. ఆది స్కిట్ కోసమే ప్రత్యేకంగా జబర్దస్త్ ను చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి జబర్దస్త్ ఆది కనిపించడం లేదు. దీంతో అనేక రూమర్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలు.. ఆది కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ ప్రోమోలో తెలిపాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. తాజాగా “సంక్రాంతి శుభాకాంక్షలు” అనే కాన్సెప్ట్ తో రానుంది. మూడు నిమిషాల ఇరవై అయిదు సెకన్లు ఉన్న ఈ ప్రోమో తెగ ఆకట్టుకుంది. రాకెట్ రాఘవ డ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. అలానే బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది పెద్ద రాయుడి గెటప్ లో చేసిన స్కిట్ అందర్ని కడుపుబ్బా నవ్వించింది. ఈ క్రమంలోనే రష్మి.. హైపర్ ఆదిని కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి ఆది సైతం చాలా ఫన్నీగా సమాధానాలు ఇచ్చాడు. ఇదే సమయంలో జబర్దస్త్ మానేయడానికి ఈ ముగ్గురి లో ఎవరు కారణం అంటూ యాంకర్ సౌమ్యరావుతో పాటు మరో ఇద్దరి ఫోటోలను రష్మి స్క్రీన్ పై చూపిస్తుంది.
సౌమ్యరావును చూపిస్తూ.. నేను జబర్దస్త్ మానేయడానికి ఈమె కారణం అంటూ హైపర్ ఆది అంటాడు. దీంతో జడ్జీ ఇంద్రజతో సహా అక్కడి నటీనటులు సైతం ఆశ్చర్యపోతారు. ప్రోమో అంతటితో ఎండ్ అయిపోతుంది. మరి.. సౌమ్యరావే కారణం ఎందుకు అనే వివరాలు మాత్రం ఆది చెప్పలేదు. అసలు సంగతి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ.. ఈ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.