బుల్లితెర హీరోగా తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న సీరియల్ హీరో రిషి. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పరిచయమైన ఈ నటుడు అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల స్టార్ మా నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ వేదిక ద్వారా తన తండ్రిని, తన కుటుంబాన్ని పరిచయం చేసి అందరి నోళ్లల్లో నానుకుపోతున్నాడు. అయితే ఈ షోలో తండ్రి పక్షవాతానికి గురవ్వడంతో మా నాన్నని నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటున్నానంటూ అంటూ తెలిపి ప్రతీ ఒక్కరిని కంట కన్నీరు పెట్టించాడు. అసలు ఇంతకు ఎవరీ రిషి. ఇతని జీవితంలో అంతగా విషాదం నిండిపోవడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రిషి పూర్తి ముఖేష్ గౌడ. ఇతను కర్టాటకలోని చామ్రాజ్ నగర్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతనికి ఒక చెల్లి ఉంది. ఆమెకు పెళ్లై ఓ బాబు కూడా జన్మించాడు. ముఖేష్ గౌడ చదువంతా మైసూరులోనే సాగింది. ఇంటర్ పూర్తి చేసి ఆ తర్వాత తల్లిదండ్రుల బలంతంతో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ముఖేష్ కు ఇంజనీరింగ్ చదువు అంతగా నచ్చకపోవడంతో మధ్యలోనే ఆపేసి ఆ తర్వాత బీసీఐ పూర్తి చేశాడు. ఇక ఆ కోర్సు పూర్తి చేసిన వెంటనే ముఖేష్ బెంగుళూరు నిర్వహించిన ప్రతీ మోడలింగ్ లో పాల్గొనేవాడు. అలా మోడలింగ్ చేస్తున్న క్రమంలోనే ముఖేష్ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ ను గెలుచుకున్నాడు.
అలా ముందుకు వెళ్తున్న క్రమంలోనే ముఖేష్ గౌడకు నాగకన్నిక అనే సీరియల్ ద్వారా కన్నడ బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఇక ఈ సీరియల్ లో నటిస్తూనే నాగమండల అనే మరో కన్నడ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. అలా రెండు సీరియల్ లో నటిస్తూ నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ముఖేష్ నటనలో ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలోనే ఇతనికి ఈటీవీలో ప్రసారమైన ప్రేమ నగర్ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా తెలుగు బుల్లితెరపై వాలిపోయాడు. అలా కొంత కాలానికి ముఖేష్ కి గుప్పెడంత మనసు సీరియల్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుని తక్కువ కాలంలోనే మంచి నటుడిగా పేరు ప్రత్యేకతలు సంపాదించుకున్నాడు.
ముఖేష్ గౌడ లైఫ్ ఇలా ఎంతో ఆనందంగా సాగుతున్న క్రమంలోనే తండ్రి పక్షవాతానికి గురయ్యాడు. దీంతో ముఖేష్ తండ్రి మంచానికే పరిమితమవ్వడంతో తండ్రికి అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఇక ముఖేష్ తల్లి ఇంటి వద్దే ఉంటూ భర్తను చూసుకుంటూ ఉంది. ఇక ఇటీవల స్టార్ మా నిర్వహించిన పరివార్ అవార్డ్స్ లో పాల్గొన్న ముఖేష్ తన తండ్రిని, తల్లిని పరిచయం చేస్తూ అందరి అందరి కంట కన్నీరు పెట్టించాడు. ఈ అవార్డ్ కార్యక్రమంలో ముఖేష్ తండ్రిని పరిచయం చేస్తూ.. మా నాన్న ఉన్నట్టుండి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. దీంతో మా నాన్నని నాకే పుట్టిన కొడుకులా చూసుకుంటున్నాను. ఇక అందరి లైఫ్ లో ఇలా జరుగుతుందో లేదో తెలియదు కానీ, నా లైఫ్ లో జరిగింది అంటూ తన విషాదాన్ని నలుగురితో పంచుకున్నాడు. ముఖేష్ మాటలు విన్న అక్కడున్న ప్రతీ ఒక్కరు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇలా సీరియల్ లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్న రిషి ( ముఖేష్ గౌడ) భవిష్యత్ లో కూడా మరిన్ని అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం.