సుడిగాలి సుధీర్.. కమెడియన్‌గా, హీరోగా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. యూట్యూబ్‌లో అయితే సుధీర్ ఫ్యాన్స్ చేసే రచ్చఅంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అయితే బడా హీరోలు సైతం సుధీర్ క్రేజ్ ముందు తగ్గాల్సిందే. యాంకర్, కమెడీయన్‌గా కొనసాగుతూనే అటు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే హీరోగా ఇంకా సరైన హిట్ పడలేదనే చెప్పాలి.
మెజీషియన్‌గా తనకు లైఫ్ ఇచ్చిన సంస్థ, కమెడీయన్‌గా తనకు లైఫ్ ఇచ్చిన ఛానల్ నుంచి సుడిగాలి సుధీర్ ఇటీవల వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై చాలానే రచ్చ జరిగింది. ఆ తర్వాత ఆ షోలో సుధీర్ పై గట్టిగానే పంచులు, కౌంటర్లు పడ్డాయి. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఈజ్ బ్యాక్ అంటూ ఓ ప్రోమో విడుదల చేసిన విషయం తెలిసిందే. సుధీర్‌ని మళ్లీ ఆ స్టేజ్‌పై చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
కానీ, ఆ ప్రోమో విషయంలో మాత్రం పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సుధీర్‌పై అందరూ పంచులు వేస్తూ ఎగతాళి చేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు లైఫ్ ఇచ్చిన ఛానల్‌కు సుధీర్ తిరిగి రావడాన్ని ఎవరూ తప్పుబట్టరు కానీ, అభిమానుల మనోభావాలను సైతం పరిగణలోకి తీసుకోవాలి కదా అని కామెంట్ చేస్తున్నారు.
నిజానికి ఆ షో నుంచి ఎంతో మంది సీనియర్ కమెడియన్లు, యాంకర్ సైతం వెళిపోయారు.. తిరిగి వచ్చారు. కానీ, ఎవరి మీద ఇంతలా ట్రోలింగ్, పంచులు వేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ అందరి కమెడియన్లలా కాదని.. తన అభిమానులు, అతని ఫాలోయింగ్ వేరంటూ చెబతున్నారు. రీ ఎంట్రీ విషయంలో మరొక్కసారి అయినా ఆలోచించుకుని ఉంటే బాగుండేదంటున్నారు.
నిజానికి సుడిగాలి సుధీర్‌కు ఉండే ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్‌కు స్టేజ్ మీద అతనిపై వేసే పంచులకు అసలు పొంతన ఉండదంటున్నారు. ఆఖరికి మేకప్ మ్యాన్లతో కూడా సుధీర్ కౌంటర్లు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు కెరీర్‌లోనైనా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.