ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలు దాదాపు అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్లే. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదరికం నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళే. ఇప్పుడు జబర్దస్త్ లో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కమెడియన్లు కూడా ఒకప్పుడు తినడానికి అన్నం కూడా లేని పరిస్థితి. చాలా సందర్భాల్లో పలు కమెడియన్లు అవకాశాల కోసం పడ్డ కష్టాలను పంచుకున్నారు. జబర్దస్త్ లోకి రాకముందు వీళ్లంతా వేరే వృత్తుల్లో చేసిన వాళ్ళే. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి అవకాశాల కోసం అనేక కష్టాలు పడ్డారు. ఇలా అవకాశాల కోసం కష్టాలు పడ్డ వారిలో జబర్దస్త్ బ్యూటీ వర్ష ఒకరు. జబర్దస్త్ లోకి రాక ముందు వర్ష కొన్ని సీరియల్స్ లో నటించడం జరిగింది.
సినిమాల్లో కూడా నటిగా నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసిందట. ఆ సమయంలో కొంతమంది దర్శకులు వర్షకి సినిమా పేరుతో చుక్కలు చూపించారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడిందట. ఎక్స్ పోజింగ్ చేయమంటూ ఒత్తిడి చేశారని ఆమె ఆవేదనను వ్యక్తం చేసిందట. ఒక సినిమాకే కాదు, రెండు, మూడు సినిమాల్లో కూడా ఇలానే ఒత్తిడి తెచ్చారట. అందాలను చూపించాలని అనడంతో ఆమె అవకాశాలను వదులుకుందట. అయితే తన టాలెంట్ తో జబర్దస్త్ లో అవకాశాలను దక్కించుకుని సక్సెస్ అయ్యింది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్కిట్లు చేస్తోంది. వీరిద్దరిదీ సూపర్ హిట్ జోడీ అన్న పేరు కూడా ఉంది.
ఆ రకంగా జబర్దస్త్ వర్ష రాజీ పడకుండా తన టాలెంట్ తో పైకొచ్చిందన్నమాట. అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కాంప్రమైజ్ ఐతేనే సక్సెస్ వస్తుందని సక్సెస్ అయిన వాళ్లు చెబుతారు. రాజీ పడడం అంటే చాలా విషయాలు ఉంటాయి. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా రాజీ పడాల్సి వస్తుంది. కానీ సక్సెస్ రావాలంటే రాజీ పడాలి, లొంగాలి, కళ్ళు, నోరు అన్నీ మూసుకోవాలి, సర్దుకుపోవాలి అని కాకుండా.. మనలో మేటర్ ఉండాలి అని వర్ష నిరూపించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.