మహిళలు అనేక రంగాల్లో దూసుకెళుతున్నారు. వాళ్లు ఎంచుకున్నఏ రంగంలోలైనా తమదంటూ ముద్ర వేస్తున్నారు. అవమానాలు, అవహేళనలు తట్టుకుని విజయం సాధిస్తున్నారు. ఎంత ముందుకు వెళుతున్నా, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్ చేస్తున్నారు. వెకిలి చేష్టలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని మరింత మానసిక వేదనకు గురి చేస్తున్నారు. మామూలు రంగంతో పోలిస్తే గ్లామర్ రంగంలో ఈ వెకిలి పాళ్లు మరింత ఎక్కువ. హీరో,హీరోయిన్లు గ్లామర్ గా కనిపిస్తే ఒక రకమైన కామెంట్స్, కనిపించకపోయినా మరో రకమైన కామెంట్లతో వారిపై దాడి చేసేస్తారు. వీరిలో అధికంగా బలయ్యేది మాత్రం నటీమణులే. ఏకంగా తమ వ్యక్తిగత విషయాలతో పాటు ప్రైవేట్ పార్స్ పై ఇష్టమొచ్చినట్లు కూతలు కూస్తారు. ఇటువంటివే ఎదుర్కొన్నారు బాలీవుడ్ నటి చత్వీ మిట్టల్.
నటి చత్వీ మిట్టల్ హుస్సేన్ ఆమె బెస్ట్ క్యాన్సర్‌కు గురై ఇటీవలే కోలుకున్నారు. తనలా మరొకరు బాధపడకూడదని ఆమె ఈ వ్యాధి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ.. తన ఆరోగ్యంగా ఉన్న ఫోటోలను, వెకేషనల్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇటీవల తన బికినీ ఫోటో షేర్ చేయగా.. కొందరూ పాజిటివ్ గా తీసుకుంటుండగా.. మరికొంత మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. క్యాన్సర్ సర్జరీలో వక్షోజాలు కత్తిరిస్తారా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా, బహుశా ఆమె సిలికాన్లను తొలగించవచ్చు అంటూ మరో వల్గర్ కామెంట్లు చేశారు. వీటిపై ఆమె ఘాటుగానే స్పందించారు. అవునని, ఈ అంశం సున్నితమైనప్పటికీ.. తన వక్షోజాల గురించి ఓ అంగడి సరుకులా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రొమ్ము క్యాన్సర్ నుండి బయటపడితే.. తన శరీర అవయవాలపై వల్గర్ కామెంట్లు చేస్తున్నారన్నారు. అయితే తాను బ్రెస్ట్ క్యాన్సర్ నుండి బయటపడ్డానని, తాను తన వక్షోజాలను సజీవంగా ఉంచుకునేందుకు కష్టపడ్డానని వీరికీ సమాధానం చెప్పాలా అంటూ చెప్పచెళ్లుమనిపించేలా సమాధానం చెప్పారు
బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయం చేసుకునేందుకు లంపెక్టమీ, మాస్టెక్టమీ వంటి చికిత్సలున్నాయని నటి అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్లకు ఓ వీడియోను కూడా రూపొందించారు. ఈ ట్రోల్ చేస్తున్న వాళ్ల కామెంట్ల సంబంధం లేకుండా ఉంటున్నాయని, మీకు ఏ క్యాన్సర్ ఉందీ, మీరూ కీమోథెరపీ తీసుకోలేదు. మీరూ జిమ్ కు వెళ్లండి అంటూ కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. క్యాన్సర్ బారిన పడితే,ఇంట్లోనే ఏడుస్తూ కూర్చోవాలా?, ఇష్టమైనదీ తినకూడదా, నచ్చిన దుస్తులూ ధరించకుండా ఓ మూలన కూర్చొవాలా అని సీరియల్ నటి ప్రశ్నించారు. తనకు క్యాన్సర్ తర్వాత తనకు రెండో జన్మ లభించినట్లు అయ్యిందని అన్నారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మీ దగ్గర నుండి నేర్చుకోవాల్సిందీ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తనకు మద్దుతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఛవీ ఆమె భర్త మోహిత్ హుస్సేన్ 2015లో డిజిటల్ ప్రొడక్షన్ కంపెనీ షిట్టి ఐడియాస్ ట్రెండింగ్ అనే సంస్థను స్థాపించి సీరియల్స్ తీస్తున్నారు. వ్యాధి బారిన పడి కోలుకున్న వారిని, ఇలా వల్గర్ కామెంట్లు చేస్తూ హింసించడం ఎంత వరకు కరెక్టో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.