అషురెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్, నటనతో అషు అందరిని ఆకర్షిస్తోంది. అషు రెడ్డి బిగ్ బాస్-3 షో లో పాల్గొన్ని మంచి గుర్తింపు సంపాదించింది. సోషల్ మీడియాలో సైతం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. ఇక ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి అషు బేబి ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆర్జీవీ తో అషు చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరు రచ్చ రచ్చ చేశారు. సెప్టెంబర్ 15 ఈ అమ్మడి పుట్టిన రోజు. దీంతో గురువారం రాత్రి ఈ అమ్మడి బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి హాజరైన ఆర్జీవీ.. అషుతో కలసి రచ్చ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అషు రెడ్డి డబ్ ష్మాష్ వీడియోలు, సోషల్ మీడియాలతో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ , ప్రైవేట్ సాంగ్స్ తో మంచి పాపులారిటి సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తో ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన అనంతరం టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో అషు రెడ్డి నిత్యం వార్తల్లోనే ఉంటోంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అంతేకాక తన సహచరులకు అషు బేబి బర్త్ డే పార్టీ ఇచ్చింది.
ఈ పార్టీకి సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. తనదైన స్టైల్ లో అషు రెడ్డి చేతిని పట్టుకుని కేక్ కట్ చేయించాడు. వీరిద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఈ బర్త్ డే పార్టీకి సినీ నటి హేమ, హరితేజ, మెహబూబ్, బజర్దస్త్ పవిత్ర తదితరులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అషు రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓలుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి