జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుదీప్ ఎక్కడుంటే అక్కడ ఫన్ నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ చేస్తుంటాడు. అయితే.. గతేడాది యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని ఎలాంటి సందడి చేసాడో తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్యాష్ షోలో అనుదీప్ హవా మొదలైంది. తాజాగా క్యాష్ నుండి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. తాను తెరకెక్కించిన ప్రిన్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ ఈ షోలో పాల్గొన్నాడు. అనుదీప్ తో పాటు ప్రిన్స్ మూవీ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ మరియా కూడా షోలో సందడి చేశారు. అనుదీప్ కోసం యాంకర్ సుమ బ్యాండ్ మేళం ఏర్పాటు చేయడం హైలెట్ గా నిలిచింది.
ఇక ప్రోమో అంతా మంచి ఫన్ తో సాగింది. ముఖ్యంగా అనుదీప్, హీరో శివ కార్తికేయన్ ఇద్దరూ యాంకర్ సుమను ఓ రేంజిలో ఆటాడుకున్నారు. జనరల్ గా సుమనే అందరినీ ఆడుకుంటుంది. కానీ.. అనుదీప్ వచ్చాడంటే ఆమెకు తిప్పలు తప్పవనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. షో గురించి ఏమైనా చెప్పాలని సుమ అడగ్గా.. ‘షో చూసి ఎంజాయ్ చేయండి’ అని అనుదీప్ పంచ్ వేశాడు. అలాగే ఇలాంటి షోకి మీరెప్పుడైనా వెళ్ళారా? అని శివ కార్తికేయన్ ని సుమ అడగ్గా.. “చాలా అటెండ్ అయ్యాను. కానీ ఇదే మొదటిసారి” అని పంచ్ వేయడం విశేషం. ప్రస్తుతం ఈ ప్రోమో తెగవైరల్ అవుతుండగా.. ప్రిన్స్ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.