సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీలు రావడం, సందడి చేసి వెళ్లడం చూస్తుంటాం. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తుంటారు. కానీ.. కొందరి విషయంలో ప్రేక్షకులు మర్చిపోలేనంతగా కనెక్ట్ అయిపోతారు. అలా టీవీ ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయిన సెలబ్రిటీ ఎవరంటే.. జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్. ఇతను ఎప్పుడైతే సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడో.. అప్పటినుండి అనుదీప్ పేరు.. క్యాష్ అనుదీప్ గా మారిపోయింది. ఎందుకంటే.. అనుదీప్ షోలో పాల్గొన్న ఎపిసోడ్ ఆ స్థాయిలో హిట్ అయ్యింది. అదీగాక అనుదీప్ షోలో కనిపించే ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తుంటారు.
ఇక అనుదీప్ డైరెక్టర్ గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతోంది. అయితే.. ప్రిన్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ ప్రిన్స్ టీమ్ తో క్యాష్ షోలో పాల్గొన్నాడు. అనుదీప్ అంటేనే క్యాష్ షో హీరోలా పిలుచుకునే ఫ్యాన్స్ కి.. ఈసారి మాస్ ఎంట్రీతో సర్ప్రైజ్ చేశాడు. అనుదీప్ కోసం యాంకర్ సుమ బ్యాండ్ మేళం ఏర్పాటు చేయడం విశేషం. ఇక ఫ్యాన్స్ అనుదీప్ ని భుజాలపై ఎత్తుకొని, బ్యాండ్ మేళంతో ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. షో గురించి ఏమైనా చెప్పండని సుమ అడగ్గా.. ‘షో చూసి ఎంజాయ్ చేయండి’ అని చెప్పి పంచ్ వేసిన ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.