యాంకర్ విష్ణుప్రియ.. ఒక య్యూబర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. యాంకర్ గా రాణిస్తూనే అటు హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు సాగించింది. ఇటీవల విడుదలైన వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కన్నతల్లి కాలం చేశారు. గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచినట్లు స్వయంగా విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యింది.
తన పోస్టులో.. “మై డియర్ అమ్మ.. ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా..” అంటూ విష్ణుప్రియ భావోద్వేగ భరిత పోస్టును షేర్ చేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న బుల్లితెర కమేడియన్లు, యాంకర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విష్ణుప్రియ- జబర్దస్త్ రీతూ చౌదరి చాలా మంతి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఇటీవలే వాళ్లిద్దరూ కలిసి వెకేషన్ కి కూడా వెళ్లొచ్చారు. వారిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ తెలుసు. అయితే ఇటీవలే రీతూ చౌదరి వాళ్ల తండ్రి కాలం చేశారు. ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియ వాళ్ల అమ్మ తుదిశ్వాస విడిచారు. రోజుల వ్యవధిలోనే ఇద్దురు మిత్రుల ఇంట తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. ఈ వార్తలతో బుల్లితెర సెలబ్రిటీలు భావోద్వేగానికి లోనవుతున్నారు. వాళ్లిద్దరినీ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.