ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర యాంకర్ గా దూసుకుపోతుంది. డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, బిబి జోడి వంటి షోస్ తో అలరిస్తూ వస్తుంది. బుల్లితెర మీద యాంకరింగ్ తో, గ్లామర్ తో ఆకట్టుకునే ఈ బుల్లెమ్మ.. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. అదిరిపోయే గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్ కి పిచ్చ ట్రీట్ ఇస్తుంటుంది. ఆ ఫోటోలను చూసి అభిమానులు పిచ్చెక్కిపోతారు. శ్రీముఖి శ్రీముఖి అంటూ జపిస్తుంటారు. షో అన్నాక ఆ షోని చూసే ఫ్యాన్స్ ని ఆకట్టుకోవాలంటే.. కట్టులో మాంచి రసపట్టు ఉండాలి. షో రసపట్టు మీద నడిస్తేనే జనాలు బాగా ఎట్రాక్ట్ అవుతారు. క్రేజ్ ఉన్న యాంకర్స్ కే షోస్ లో అవకాశాలు వస్తాయి. ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవాలంటే ఎట్రాక్టివ్ గా కనిపించాలి.
ఎట్రాక్టివ్ గా కనిపించడం అంటే వాళ్లకి తెలిసింది ఒకటే లాంగ్వేజ్ గ్లామర్ లాంగ్వేజ్. ఈ గ్లామర్ లాంగ్వేజ్ కోసం బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటారు. ఈ క్రమంలో శ్రీముఖి కూడా తగ్గేదేలే అన్నట్టు గ్లామర్ షో చేస్తుంది. అటు బుల్లితెర మీద, ఇటు ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోస్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా బిబి జోడి షోకి సంబంధించి ఒక ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోలో యాంకర్ గా చేసిన శ్రీముఖి.. మోడ్రన్ అవుట్ ఫిట్ లో రచ్చ లేపింది. ఒక మీటర్ సైజ్ కలిగిన డ్రెస్ లో జిగేలుమంటూ మెరిసిపోతుంది. మెరుపుల డ్రెస్ లో అరుపులు పెట్టిస్తోంది. మరీ కటిక పేదరికంలో ఉందో ఏమో తెలియదు గానీ.. దుస్తుల్లో పొదుపుతనం కనిపిస్తుంది.
పొదుపుతనం కూడా కాదు, పిసినారితనం కనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరీ నిండుగా కప్పుకుంటే ఖర్చు ఎక్కువైపోతోంది కాబోలు ఇలా పిసినారితనం చూపిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎల్కేజీలో కుట్టించిందేమో ఈ డ్రెస్సు, మతోయిందంటే ప్రామిస్సు’ అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. 80స్, 90స్ లో అమ్మాయిలు సన్నని నడుము చూపించాలంటేనే తెగ ఆలోచించేవాళ్ళు. మరీ ఇంత పిసినారివేంటే అని అబ్బాయిలు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది. దుస్తులు కొనుక్కోవడానికి పిసినారితనం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఏంటో కలికాలం. మరి ఈ విషయంలో మీరేమంటారు?