సెలబ్రిటీలపై సోషల్ మీడియా ట్రోల్స్ అనేవి చాలా కామన్. అందులోనూ అందమైన యాంకర్స్ షోలో కనిపిస్తే నెటిజన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మీ గౌతమ్. మొదట సినిమాలలో హీరోయిన్ గా మెరిసిన రష్మీ.. సినిమాలతో పాటు జబర్దస్త్ స్టేజిపై కూడా గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కూడా రష్మీ సందడి చేస్తోంది. మొత్తానికి అనసూయ లేకపోయినా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మూడు షోలను రష్మీనే హ్యాండిల్ చేస్తోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది. ఇటీవల కూడా నెటిజన్స్ తో చిట్ చాట్ చేసే సమయంలో పలు కాంట్రావర్సీ ప్రశ్నలకు తెరలేపింది. రష్మీపై కొందరు నెటిజన్స్ ‘ఆ చెత్త షోలు చేయడం ఎందుకు? మంచి సినిమాలు చేసుకోవచ్చు కదా.. `జబర్దస్త్` షో అడల్ట్ కంటెంట్ కి కేరాఫ్’ అంటూ చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది రష్మీ. ‘నాకు సినిమాలు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా దగ్గర చాలా స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. సినిమాలను నువ్వు నిర్మిస్తానంటే చెప్పు నేను టీవీ షోస్ వదిలేసి సినిమాలు చేస్తా’ అని కౌంటర్ వేసింది.
ఇక మరో నెటిజన్.. జబర్దస్త్ షో చూసి పిల్లలు పాడవుతున్నారు? అనే కామెంట్ కి స్పందించిన రష్మీ.. “ఈ షోలు మేము ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయడానికి మాత్రమే. పిల్లలు 9 వరకు పడుకుంటారు కదా, ఆ తర్వాతే మా షో టీవీలో వస్తుంది. అయినా ఇప్పుడు అందరి పిల్లల దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి.. అందులో వాళ్లకు కావాల్సిన అడల్ట్ కంటెంట్ ఉంటోంది కదా! దాన్నిఎలా ఆపుతారు?” అని తిరిగి ప్రశ్నించింది రష్మీ. దీంతో నెటిజెన్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత జబర్దస్త్ పై తనకు రెస్పెక్ట్ ఉందని, దానివల్లే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పింది రష్మీ. ప్రస్తుతం రష్మీకి సంబంధించి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరి రష్మీ కౌంటర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.