జబర్దస్త్.. ఈ షో ద్వారా తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, స్టార్ కమెడియన్లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ కామెడీ షో నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్లు వెళ్లిపోయారు. ఇటీవలే స్టార్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. అనసూయ జబర్దస్త్ ని వీడిందనే విషయాన్ని ఇప్పటికీ ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి అనే చెప్పాలి.
అయితే ఆమె స్థానంలోకి కొత్త యాంకర్ వస్తోందని బాగా ప్రచారాలు జరిగాయి. ఆమె ప్లేస్ లోకి యాంకర్ మంజూష వస్తోందని జోరుగా ప్రచారం జరిగింది. కొత్త యాంకర్ రివీల్ అంటూ జబర్దస్త్ వాళ్లు ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. తీరా చూస్తే అక్కడ కొత్త యాంకర్ ఎవరూ లేరు. ఆమె రష్మీనే అని తెలుసుకుని అంతా ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు కొత్త యాంకర్‌పై రష్మీ గౌతమ్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. “జబర్దస్త్‌కి తిరిగి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ షో కోసం నేను చేయగలిగినంత వరకు చేస్తూనే ఉంటాను. మరో కొత్త యాంకర్ దొరికే వరకు ఈ హోస్ట్ పోస్ట్ ని నేను భర్తీ చేయనున్నాను. అప్పటి వరకు ఎప్పటిలాగానే నన్ను భరించండి” అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అంటే ఇంకా జబర్దస్త్ కి యాంకర్ దొరకలేదు. దొరికే వరకు రష్మీనే జబర్దస్త్ కి కూడా యాంకర్ గా కొనసాగుతుంది. రష్మీ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.