యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. అవును ఆ విషయం ప్రస్తావించేసరికి తట్టుకోలేకపోయింది. యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఓ మనిషి లాంటిదే. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో యాంకర్ గా పరిచయమైనప్పటికీ.. సుధీర్ వల్ల చాలా అంటే చాలా ఫేమస్ అయింది. వీళ్లిద్దరూ జోడీగా ఎప్పుడు మారారో అప్పటినుంచి ఆయా షోల రీచ్ అమాంతం పెరిగిపోయింది. కోట్లాది మంది ప్రేక్షకులు వీళ్లకు ఫిదా అయిపోయారు. సుధీర్-రష్మీ కోసమే అన్నట్లు షోలు చూసేవాళ్లు. అలాంటిది ఇప్పుడు వీళ్లు కలిసి పనిచేయట్లేదు. సరికదా షోల్లోనూ కలిసి కనిపించట్లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన రష్మీ టాలీవుడ్ లో నటిగా కెరీర్ ప్రారంభించింది. 2000 తర్వాత వచ్చిన పలు సినిమాల్లో గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసింది. హోలీ, కరెంట్ సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడైతే ‘జబర్దస్త్’లో యాంకర్ గా అడుగుపెట్టిందో ఈమె లైఫే మారిపోయింది. నటిగా రానీ ఫేమ్ యాంకరింగ్ తో సంపాదించింది. ఈ క్రమంలోనే లీడ్ రోల్ లో ‘గుంటూరు టాకీస్’ లాంటి హిట్ కూడా కొట్టింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు చేసింది గానీ హిట్స్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇక స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా రిలీజ్ చేసిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమోలో మాత్రం రష్మీ కన్నీళ్లు పెట్టుకున్నంత ఎమోషనల్ అయింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాలంటైన్స్ డే సందర్భంగా ‘చెప్పు బుజ్జికన్నా’ అనే ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఆదివారం టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో చివర్లో ‘FLAMES’ గేమ్ ఆడారు. తొలుత వర్ష-ఇమ్ము తమ పేర్లు వేసి చూడగా.. మ్యారేజ్ అని వచ్చింది. ఆ తర్వాత రష్మీ కోసం సుధీర్ పేరు రాయడానికి హైపర్ ఆది ప్రయత్నించగా ఆమె ఆ పేపర్ ని చింపేసింది. అక్కడే తలవాల్చి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఇది చూసిన సుధీర్-రష్మీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి రష్మీ కన్నీళ్లు పెట్టుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.